Home » Entertainment » Ritu Chowdhary Satires On Azar In Jabardasth Show
Entertainment

Jabardasth Show : వాడు ఏమీ చేయలేడు.. అజర్ పరువుతీసిన జబర్దస్త్ రీతూ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 21, 2022 7:04 pm
Advertisement

Jabardasth Show : బుల్లితెరపై జబర్దస్త్ షో, అందులోని ట్రాకులు, లవ్ బర్డ్స్ ఎంతగా ఫేమస్ అవుతుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ సుధీర్ రష్మీ, ఇమాన్యుయేల్ వర్ష, రాకింగ్ రాకేష్ రోహిణి, రాకింగ్ రాకేష్ సుజాత ఇలా జంటలు బాగానే ఫేమస్ అయ్యాయి. రాకేష్ విషయంలో ఇద్దరమ్మాయిలు మారిపోయారు. మొదట్లో రోహిణితో ట్రాక్ వర్కవుట్ చేశారు. ఆ తరువాత లైన్‌లోకి సుజాత వచ్చింది. ఇప్పుడు రాకేష్ సుజాత ట్రాక్ ట్రెండింగ్‌లో ఉంది. అది కాకుండా ఇంకో కొత్త జంట కూడా తెర మీదకు వచ్చింది.

Advertisement

అజర్ రీతూ కూడా ఈ మధ్య బాగానే ఎక్స్ ట్రాలు చేస్తున్నారు. తెరపై నిజమైన ప్రేమికులన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. హగ్గులు ఇచ్చుకుంటున్నారు. రీతూ అయితే ఇంకాస్త ఎక్కువగా పర్ఫామెన్స్ చేస్తోంది. అజర్ పేరు చెబుతూ కన్నీరు కూడ కార్చేస్తోంది. మొత్తానికి రీతూ అజర్ జంటను మాత్రం మల్లెమాల టీం బాగానే ఎంకరేజ్ చేస్తోంది. హైపర్ ఆది జబర్దస్త్ షోలో కనిపించకపోవడంతో ఓ టీం తక్కువైంది. దీంతో అజర్ లాంటి వాడికి కూడా మల్లెమాల టీం లీడర్‌గా అవకాశం ఇచ్చింది. కానీ అజర్ నిరూపించుకోలేకపోతోన్నాడు.

Ritu CHowdhary Satires on Azar In Jabardasth Show

Advertisement

అజర్ చేసిన ఏ స్కిట్ కూడా ఇంత వరకు జనాలకు నచ్చలేదు. దీంతో అజర్ పరిస్థితి అయోమయంగా మారేట్టుంది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రీతూ ఓ కౌంటర్ వేసింది. ఆ కౌంటర్ వేసింది రీతూనే అయినా రాసింది మాత్రం అజర్ అయి ఉంటాడు. తన గురించి తాను కరెక్ట్‌గానే రాసుకున్నట్టు అనిపిస్తోంది. నన్నేం చేయకు అని ఓ అమ్మాయి అజర్‌ని చూసి భయపడుతుంటుంది.

ఇంతలో రీతూ వచ్చి అదిరిపోయేలా సెటైర్ వేస్తుంది. ఇంత పెద్ద స్కిట్టే ఇస్తే ఏం చేయలేకపోతోన్నాడు.. వాడు నిన్నేం చేస్తాడు అని కౌంటర్ వేస్తుంది.దీంతో అందరూ పగలబడి నవ్వేస్తుంటారు. అయితే ఆ తరువాత పంచ్‌లో రీతూ మీద రివర్స్ కౌంటర్ పడుతుంది. దీంతో ఏం చేయాలో తెలీక తెల్లమొహం వేస్తుంది. ఎందుకంటే అది ప్రాక్టీస్‌లో లేదని, తనకు ముందే చెప్పలేదని తెల్లమొహం వేసి ఆశ్చర్యపోతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి