జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి రాఘవ అందులోనే ఉన్నాడు. ఎంతో మంది వచ్చారు.. వెళ్లారు.. ఇంకా వస్తూనే ఉన్నారు.. వెళ్తూనే ఉన్నారు. టీం లీడర్లు మారిపోయాడు.. కంటెస్టెంట్లు టీం లీడర్లుగా ఎదిగారు. కొందరు వేరే చానెళ్లు, వేరే షోలంటూ వెళ్లిపోయారు. ఇంకొందరు బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లారు.. ఇక మరీ ముఖ్యంగా తాను దైవంలా భావించే నాగబాబు జబర్దస్త్‌ను వీడిపోయాడు. కానీ రాఘవ మాత్రం అక్కడే ఉండిపోయాడు. ఎవ్వరూ కదిలించలేని గట్టి పునాదిలా ఉండిపోయాడు.
రాఘవ జబర్దస్త్‌కు రాక ముందు నుంచీ ఫేమస్సే. ఎన్నో సినిమాలో కామెడీ వేషాలు వేశాడు. బుల్లితెరపై ఇంకెన్నో కామెడీ షోలను చేశాడు. లైవ్ షోలను నిర్వహించాడు. అప్పుడెప్పుడో జెమినీ చానెల్‌లో వచ్చిన నవ్వుల ప్రోగ్రాంలోనూ యాంకర్‌గా ఉన్నాడు. అలా ఎన్నెన్నో చేసి చివరకు జబర్దస్త్‌లోకి వచ్చాడు. ఇక్కడకు వచ్చాకు మాత్రం అలా స్థిరంగా ఉండిపోయాడు. మధ్యలో సినిమా ఆఫర్లు వస్తుంటే.. అవి చేసుకుంటూనే జబర్దస్త్‌ను వీడకుండా ఉన్నాడు.
అయితే రాకెట్ రాఘవ స్కిట్లు మరీ అంత గొప్పగా ఉండకపోయినా.. మిగతా వారిలా మరీ అంత వల్గర్‌గా, డబుల్ మీనింగ్‌లతో ఉండవు. కాస్త డీసెంట్‌గానే ఉంటుంది. అలా రాకెట్ రాఘవ తాజాగా ఓ స్కిట్‌లో మాట్లాడుతూ.. ఓ నిజం బయటపెట్టేశాడు. మొన్న పడ్డ వానలకు నువ్ మునిగిపోయినా దరిద్రం వదిలిపోయేదంటూ రాఘవపై ఓ ఆర్టిస్ట్ సెటైర్ వేశాడు. దానికి ప్రతిగా రాఘవ స్పందిస్తూ.. నన్ను ముంచాలని చాలా మంది చూశారురా.. అది మీ వల్ల కాదురా అని జబర్దస్త్ షోలోని పాలిటిక్స్‌పై అలా పరోక్షంగా పంచ్‌లు వేశాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.