Home » Entertainment » Roja And Mano Beaten Hyper Aadi For Skit
Entertainment

Hyper Aadi : ఆ మాటలకు హర్టైన జబర్దస్త్ జడ్జ్.. హైపర్ ఆదిని చితకబాదిన రోజా

Authored By
Cinema Desk
The Telugu News | Published on: February 18, 2022, 12:30 pm
Advertisement

Hyper Aadi : హైపర్ ఆది వేసే పంచ్‌లకు అందరూ పడి పడి నవ్వాల్సిందే. హైపర్ ఆది ఒక్కడే జడ్జ్‌లు, యాంకర్ల మీద ధైర్యంగా సెటైర్లు వేయగలడు. తన స్కిట్లో రోజా, మనో, యాంకర్ అనసూయను దారుణంగా ఆడేసుకుంటాడు. హైపర్ ఆది వేసే స్కిట్లు, చేసే ఎక్స్ ట్రాలు, పంచ్‌లు, సెటైర్లకు ఎవ్వరూ అడ్డు చెప్పరు. హైపర్ ఆదికి ఉన్న డిమాండ్ అటువంటిది. ఈ మధ్యే రోజా హోం టూర్ కూడా చేసేశాడు.

Advertisement

అయితే తాజాగా చేసిన స్కిట్లో రోజాను, మనోని దారుణంగా వాడేశాడు. ఎన్ని రకాలుగా రోస్ట్ చేయగలడో అన్ని రకాలుగా ఆడేసుకున్నాడు. రోజా హోం టూర్ ఎందుకు చేయాలనిపించింది? అని ఓ ప్రశ్నను స్కిట్లో రాసుకున్నాడు. దానికి సమాధానంగా ఆది దారుణంగా పరువుతీసేశాడు. ఓల్డేజ్ హోం టూర్ చేయాలని అనుకున్నాను.. అందుకే అలా చేశాను అని అనేశాడు.

Roja And Mano Beaten Hyper Aadi For Skit

Advertisement

Hyper Aadi : హర్టైన్ రోజా, మనో..

అంటే రోజాను ముసల్దానిగా అభివర్ణించేశాడు. ఇక మరో సందర్భంగా రోజా,మనోలిద్దరి మీద కౌంటర్లు వేశాడు. మీ ఇంట్రోకి ఓ దండం అని మనోని రోజా అంటుందట.. మీ ఇంట్రోకి ఇంకో దండం అని రోజాని మనో అంటాడట. అంటే వారి ఇంట్రోలు అంత దారుణంగా ఉంటాయని చెప్పకనే చెప్పేశాడు. ఇలా తమ మీద సెటైర్లు వేయడంతో హర్టైనట్టున్నారు. దగ్గరకు పిలిచి ఆదిని చితకబాదేశారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి