
Roja Beaten Hyper Aadi And Ram Prasad
Hyper Aadi : బుల్లితెరపై రోజా ఈ మధ్య బాగానే రెచ్చిపోతోంది. కామెంట్లు వేయడం, సెటైర్లతో స్కిట్లోకి దూరడం బాగానే చేస్తోంది. మామూలుగా అయితే ఇప్పుడు జబర్దస్త్ అంటే రోజా.. రోజా అంటే జబర్దస్త్ అన్నట్టుగా మారింది. ఇక పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లు అంటే రోజా సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. తాజాగా ఉగాది స్పెషల్ అంటూ వేసిన ఈవెంట్‌లో రోజా దుమ్ములేపేసింది. ఒక్కొక్కరినీ వాయించేసింది.ఉగాది పండుగ సందర్భంగా వేసిన ఈవెంట్ కాబట్టి.. అందులో ఉగాది పచ్చడి కోసం గొడవ పడ్డారు.
ఉగాది పచ్చడి కోసం కావాల్సిన ముడి పదార్థాలన్నీ కూడా రోజా తన వద్దే పెట్టేసుకుంది. వాటిని అడిగేందుకు వచ్చిన ఆది, రాం ప్రసాద్, భాస్కర్‌లను లాగి పెట్టి కొట్టేసింది. నరేష్‌ని అయితే ఎత్తి అవతల పారేసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. రోజా చర్యలకు అంతా ఆశ్చర్యపోయారు.మమ్మల్ని కొడతారా? ఆర్టిస్టులను కొడతారా? అంటూ ముందుకు వచ్చిన ఆది చెంపపగలగొట్టేసింది రోజా. అంతకు ముందు బుల్లెట్ భాస్కర్ దవడ పగిలిపోయింది. ఇక ఈ ఇద్దరి తరువాత రాం ప్రసాద్ ముందుకు వచ్చాడు.
Roja Beaten Hyper Aadi And Ram Prasad
ఏంది బే, పోబే అంటూ రామ్ ప్రసాద్ పరువుతీసేసింది రోజా. ఏంటి మేడం ఈ అన్యాయం అంటూ నరేష్ ముందుకు రావడంతో.. ఎత్తి అవతల పారేసింది.తమను రోజా కొట్టిందంటూ అందరూ కలిసి డౌన్ డౌన్ అనడం, నిరాహార దీక్ష పేరిట స్కిట్ చేయడం, ఆ తరువాత జాఫర్ ఎంట్రీ ఇవ్వడం ఇలా స్కిట్ అంతా కూడా నవ్వులు పూశాయి. మొత్తానికి రోజా మాత్రం తన రౌడీయిజాన్ని ఇలా స్కిట్ల రూపంలో చూపించేసినట్టుంది.
Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు (12-02-2026): గ్రహాల సంచారం ఆధారంగా ఈరోజు (గురువారం)…
ENG vs WI T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ICC T20…
Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…
Serilingampalli BRS Party : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…
Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…
Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…
BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…
This website uses cookies.