Home » Entertainment » Roja Comments On Selvamani
Entertainment

Roja : మా ఆయన అలాంటి వాడే.. రోజా కామెంట్స్ వైరల్

Authored By
Sam C
The Telugu News | Published on: February 22, 2022, 8:30 pm
Advertisement

Roja : ఒక‌ప్పుడు హీరోయిన్‌గా అద‌ర‌గొట్టిన రోజా ఇప్పుడు జ‌డ్జిగాను, రాజ‌కీయ నాయ‌కురాలిగా అడుగుతుంది. బుల్లితెర‌పై జ‌డ్జిగా రోజా చేసే సంద‌డి మాములుగా లేదు. జ‌బ‌ర్ధ‌స్త్ వంటి కామెడీ షోకి రోజా జ‌డ్జిగా ఉండ‌గా, ఆ కార్య‌క్ర‌మంలో క‌మెడీయ‌న్స్‌తో పాటు ఆమె కూడా తెగ ర‌చ్చ చేస్తుంటుంది. గతంలో ఈ ప్రోగ్రామ్ లో అసభ్యకరమైన స్కిట్ లు చేసి జనాల చేత తన్నులు తిన్న సంఘటనలు కూడా ఉన్నాయి. బుల్లితెరపై తన ప్రతాపం చూపిస్తున్న షో జబర్దస్త్..ఎన్ని షో లుపోటీగా వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా నిరంతరాయంగా ఈ షో సాగుతూనే ఉంది.. ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.. వారిని కడుపుబ్బా నవ్విస్తూనే ఉంది.

Advertisement

రీసెంట్‌గా ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో తాగుబోతు రమేష్‌ భార్యగా చేసినామె.. ముందుగా చెప్పినట్టుగా మల్లెపూలు పెట్టుకుని భర్తని రా రమ్మనట్టుగా అంటుంటే.. అతను ఇలా మంగళవారం కహానీలు చెప్తూ నో అంటాడు. దీంతో మన జబర్దస్త్ జడ్జీ రోజా ఆ స్కిట్‌లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి.. ఆ మంగళవారం సామెతను వదిలేశారు. ఈ మాట విని అంద‌రు షాక్ అయ్యారు. ఇక రోజా ఆమె భ‌ర్త‌గా మారి కూడా స్కిట్ చేశారు. కమెడీయన్‌ నూకరాజు .. రోజా,సెల్వమణిలను ఉద్దేశించి ఓ సెటైర్‌ వేశాడు.ఇందులో ఇద్దరు కమెడీయన్లు రోజా ఇంటికెళ్లి ఆమె కొత్తింటిని చూద్దామనుకున్నారు. ఇంతలో రోజా వస్తుందని తెలిసి ఆమెకి కనిపించకుండా దాక్కున్నారు. రోజా పాత్రలో నటించిన మహిళా కమెడీయన్‌ గాంభీర్యంగా వచ్చి అబ్బాయిలకు అన్యాయం జరిగితే అరగంట ఆలస్యమవుతుందేమోగానీ,

roja comments on selvamani

Advertisement

Roja : రోజా అలా ఓపెన్ అయిందేంటి..

అమ్మాయిలకు ఆలస్యమైతే అర నిమిషం కూడా ఆలస్యం చేయనంటూ ఆమె వేసిన పంచ్‌ నవ్వులు పూయించింది.నూక‌రాజు.. నా నోరు లాగుతుంది. రోజా అందంగా ఉంది అని అని. నేనే సెల్వమణి` అని పంచ్‌ వేశాడు. దీనికి ఆశ్చర్యపోయిన రోజా, నూకరాజుని తన వద్దకి పిలిపించుకుని ప్రేమతో అభినందన తెలిపింది. ఇంట్లో సెల్వమణి ఎలా ఉండాలో వెల్లడించింది. సెల్వ `రేసుగుర్రం`లో హీరోయిన్‌(శృతి హాసన్‌) లాంటివారని పేర్కొంది. అన్ని లోపలే అనుకుంటాడు. బయటకు చెప్పడని పేర్కొంది. అంతేకాదు నూకరాజుని తాను చెప్పిన డైలాగులను వైట్‌ పేపర్‌పై రాసి ఇవ్వాలని, ఇంటికెళ్లాక సెల్వమణితో చెప్పించుకుంటానని తెలిపి మరో షాకిచ్చింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి