
Roja Daughter romance with the star hero son movie entry
Roja Daughter : టాలీవుడ్ హీరోయిన్ రోజా సెల్వమణి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా మారిపోయింది. ఏపీ ప్రభుత్వంలో రోజా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి రాకముందు రోజా సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. స్టారో హీరోలందరితో రోజా కలిసి నటించింది. టాలీవుడ్‌తో పాటే తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా నటించిన రోజా మంచి పేరు సంపాదించుకుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో రోజా రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అసలు రోజా అంటేనే అందంతో పాటు అభినయంలో కూడా తిరుగులేని నటి. కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలోనే రోజా..కొలీవుడ్ డైరెక్టర్ సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా వైసీపీ పార్టీలో చేరి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మంత్రిగా ప్రమోషన్ కొట్టేసింది. రోజాకు మంత్రి స్థాయికి ఎదగడానికి ఆమె చాలా కష్టపడింది. రోజా సెల్వమణి దంపతులకు ఇద్దరు పిల్లలు. రోజా కుమార్తె అన్షు మాలిక, ఒక బాబు ఉన్నారు.అయితే,ప్రస్తుతం ఆమె వెండి తెరపై అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉందని టాక్ వినిపిస్తోంది. అన్షును హీరోయిన్‌గా చేసేందుకు రోజా తీవ్రంగా ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి.
Roja Daughter romance with the star hero son movie entry
తన నట వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమార్తెను రోజా హీరోయిన్‌ను చేసే ట్రయల్స్‌లో ఉందని ప్రచారం సాగుతోంది. అన్షు మాలిక ఇప్పటికే అమెరికాలో ఫేమస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు రావడంతో అక్కడ ట్రైనింగ్‌లో శిక్షణ పొందుతోంది. అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఆమె సినిమా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని టాక్. టాలీవుడ్‌లో స్టార్ హీరో తనయుడితో త్వరలోనే రోజా కూతురు రొమాన్స్ చేయనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.నిన్నటి తరం హీరోయిన్లలో మేనక కూతురు కీర్తి సురేష్, రాధ కూతుర్లు తులసి, కార్తీక.. మంజుల కూతుర్లు ముగ్గురు, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరందరిలో కీర్తీ సురేశ్ మినహా పెద్దగా ఎవరూ క్లిక్ కాలేదు.మరి రోజా కూతురు ఇండస్ట్రీలో సత్తా చాటుతుందో లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.