roja is missing In jabardasth comedy show
Roja : టెలివిజన్‌లో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ అందిస్తున్న ప్రోగ్రామ్స్‌లో ఒకటి ‘జబర్దస్త్’. కాగా ఈ ప్రోగ్రాం చూసేందుకుగాను ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు. కాగా, ఈ కార్యక్రమంలో ఎప్పుడూ జడ్జిలుగా రోజా, నాగబాబు ఉంటారు. అయితే, నాగబాబు కొద్దిరోజుల నుంచి కనబడుట లేదు. కాగా, తాజాగా ఆ ప్రోగ్రాంలో రోజా కూడా కనబడుట లేదు.వైసీపీ ఎమ్మెల్యే రోజా తాను రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ‘జబర్దస్త్’ కామెడి షోకు కంపల్సరీగా హాజరయ్యేది. డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ.. ‘జబర్దస్త్’ ప్రోగ్రాంకు హాజరయ్యేది. ఈ విషయమై ఇతర పార్టీలు నేతలు విమర్శలు చేసినప్పటికీ రోజా వాటన్నిటికీ సమాధానాలిస్తూ ఫైర్ బ్రాండ్‌గా ఉండేది.
roja is missing In jabardasth comedy show
అలా రాజకీయం, సినిమా రెండిటినీ బ్యాలెన్స్ చేస్తుండేది. కాగా, కొన్ని నెలలుగా ఆమె జబర్దస్త్ షోలో అప్పుడప్పుడే కనిపిస్తున్నారు. అయితే, అనారోగ్యం కారణంగా కొద్ది రోజులు షోకు హాజరు కాని రోజా ఇటీవల కాలంలో చాలా బిజీ అయిపోయారని, అందుకే షోకు రావడం లేదని తెలుస్తోంది. అయితే, మళ్లీ రోజా డేట్స్ సర్దుబాటు అయ్యాక కంపల్సరీగా జబర్దస్త్ షోకు వస్తుందని పలువురు అంటున్నారు. కాగా, రోజా ప్లేస్‌ను రిప్లేస్ చేసేందుకుగాను ఈ వారం జడ్జిగా సీనియర్ హీరోయిన్ ఇంద్రజ వచ్చేసింది. అయితే, అందం, అభినయం, జడ్జిమెంట్‌లో రోజాను రిప్లేస్ చేయగల సత్తా ఇంద్రజకు ఉందని నెటిజన్లు అంటున్నారు. ఈ క్రమంలోనే మల్లెమాల వారు ఇంద్రజను పర్మినెంట్ జడ్జిగా నియమిస్తారని పేర్కొంటున్నారు.
చూడాలి మరి.. నిజంగానే రోజా ప్లేస్‌ను ఇంద్రజ రిప్లేస్ చేస్తుందా.. తెర వెనుక ఏం జరుగుతుందో మరి.. ఇకపోతే ఇప్పటికే నాగబాబు ప్లేస్‌ను దాదాపు సింగర్ మనో రిప్లేస్ చేశారు. అలానే.. ఒక వేళ రోజా రాజకీయంగా చాలా బిజీ అయిపోయి జబర్దస్త్‌కు డేట్స్ ఇవ్వని పక్షంలో ఇంద్రజనే పర్మినెంట్ జడ్జిగా అయ్యే చాన్సెస్ లేకపోలేదు. అయితే, గతంలో చాలా సార్లు తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోను మిస్ అవ్వనని రోజా పేర్కొంది.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.