
RK roja come back to Jabardasth after elections
Roja : జబర్దస్త్ షో అంటే ప్రస్తుతం అంతా కూడా రోజామయమే. రోజా చెప్పిందే అక్కడ వేదం. అందరూ రోజాకు భక్తులే. రోజా ఏం అంటే అదే నడుస్తుంది. నాగబాబు ఉన్నంత కాలం రోజాకు రెండో స్థానం ఉండేది. నాగబాబు చెప్పిందే నడిచేది. ఆ సమయంలో రోజా నామమాత్రంగా ఉండేది. నాగబాబు వెళ్లిపోవడం రోజాకు బాగానే కలిసి వచ్చింది.అయితే ఈ జబర్దస్త్ షోలకు జడ్జ్‌గా రోజా ఉండటం మాత్రం ఎప్పుడూ వివాదాస్పదంగానే మారుతుంటుంది. తన రాజకీయ జీవితంలో ఈ షో గురించి ఎప్పుడూ కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటుంది.
అయితే ఆ మధ్య రోజా ఈ షోలను మానేస్తుందనే ప్రచారం జరిగింది. అప్పుడు కొన్ని రోజులు ఈ షోలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఆ తరువాత మళ్లీ తన స్థానంలో తానే కనిపించింది.మరోసారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రోజా కొంత కాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఇంద్రజ వంటి వారు వెలుగులోకి వచ్చారు. ఇంద్రజ, ఆమని, సంగీత ఇలా ఎంతో మందిని తీసుకొచ్చారు. మొత్తానికి చివరకు ఇంద్రజ బాగానే సెట్ అయింది.
Roja May Quit Jabardasth AFter getting Minister Post
శ్రీదేవీ డ్రామా కంపెనీ, జాతి రత్నాలు అంటూ ఇంద్రజ బుల్లితెరపై బాగానే సందడి చేస్తోంది.అయితే రోజా మాత్రం ఇక బుల్లితెరకు దూరంగా ఉండబోతోందనే టాక్ బయటకు వచ్చింది. రోజాకు మంత్రి పదవి కన్ఫామ్ కానుందట. అందులో భాగంగానే ఈ షోలకు రోజా దూరంగా ఉండనుందని తెలుస్తోంది. మంత్రి పదవి దక్కితే ఈ షోలను మానేయాల్సి వస్తుందని తెలిసే.. ఇప్పటి నుంచే దూరంగాఉంటుందని తెలుస్తోంది. అందుకే ఈ వారం జరిగిన ఎపిసోడ్‌లో రోజా కనిపించిలేదేమోనని అంతా అనుకుంటున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.