roja out from jabardath
Roja : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో జబర్ధస్త్. నటుడు నాగబాబు తో పాటు ఏళ్ల తరబడి ఆ షో జడ్జిగా వ్యవహరించారు రోజా . ఏదో షోలో కూర్చున్నామా? టీమ్స్ కి మార్కులు వేశామా? అన్నట్లు కాకుండా రోజా తన ప్రత్యేకత చాటుకున్నారు. కమెడియన్స్ పంచ్ లకు కౌంటర్లు వేయడంలో రోజా దిట్ట. ఆమె తన మార్కు పంచ్ లతో షోలో జోష్ నింపుతూ ఉంటారు. ఇక రెండేళ్ల క్రితం నాగబాబు షో నుండి తప్పుకున్నా రోజా మాత్రం కొనసాగుతున్నారు. జబర్దస్త్ షోతో ఏకంగా 9 ఏళ్ల అనుబంధం ఆమెది. జబర్దస్త్ మాత్రమే కాకుండా ఇతర షోలు, స్పెషల్ ఈవెంట్స్ లో రోజా సందడి చేస్తూ ఉంటారు. ఇటీవల రోజాకు సర్జరీ జరిగింది.
దానితో కొన్ని వారాలు జబర్దస్త్ షోతో పాటు బుల్లితెర ఈవెంట్స్ కి దూరమయ్యారు.అయితే తాజాగా రోజా జబర్దస్త్ నుండి వైదొలగనున్నారట. ఆమెకు మంత్రి పదవి వరించడమే ఇందుకు కారణం అంటున్నారు. ఏపీ సీఎం జగన్ మంత్రివర్గం పునఃవ్యవస్థీకరణ చేస్తున్న నేపథ్యంలో … ఎప్పటి నుండో ఆశలు పెట్టుకున్న రోజాకు మంత్రి పదవి ఖాయం అంటున్నారు. ఈ మేరకు రోజాకు హామీ కూడా ఇవ్వడం జరిగిందట. అయితే తాజాగా వదిలిన ప్రోమో నేపథ్యంలో రోజా స్థానంలో ఇంద్రజ వచ్చినట్టు చెబుతున్నారు. అయితే రోజా మంత్రిగా మరిన్ని బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది.
roja out from jabardath
అందుకే జబర్దస్త్ షో నుండి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారట.మరోవైపు రోజా బుల్లితెర షోలపై ఎప్పటి నుండో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. విపక్షాలతో పాటు ఆమె యాంటీ ఫ్యాన్స్ ఈ కోణం నుండి ఆమెను టార్గెట్ చేస్తున్నారు. మంత్రి పదవిలో హుందాగా వ్యవహరించాలంటే ఈ షోలకు దూరంగా ఉండడమే బెటర్ అని రోజా భావిస్తున్నారట.అందుకనే రోజా బుల్లితెరకు దూరంగా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో ఏం జరుగుతుందో…!
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.