Home » Entertainment » Rumors Have It That Priyamani Is Going To Marry Tarun
Entertainment

Priyamani : స్టార్ హీరోతో ప్రియమణి పెళ్లి? ఓకే చెప్పిన హీరో తల్లి.. అక్కడే అసలు ట్విస్ట్..

Authored By
mallesh
The Telugu News | Published on: January 4, 2022, 7:30 pm
Advertisement

Priyamani : సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ ప్రియమణి. ఒకప్పుడు స్టార్ హీరోలకు ఈ అమ్మడే బెస్ట్ చాయిస్‌గా ఉండేది. చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ఈ భామ.. చాలా మంది స్టార్ హీరోలతో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. తెలుగులోనే కాకుండా, మళియాలం, తమిళంలోనూ చాలా సినిమాల్లో నటించింది. తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పెట్టించింది ఈ అమ్మడు. కానీ ఉన్నట్టుండి మ్యారేజ్ చేసుకుని అందరినీ షాక్‌కు గురిచేసింది.తన బాయ్‌ఫ్రెండ్ ముస్తఫా‌రాజ్‌ను మ్యారేజ్ చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.

Advertisement

పెళ్లి తర్వాత కూడా మూవీస్ లో యాక్ట్ చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది ఈ భామ.ఒకప్పుడు స్టార్ హీరోగా, లవర్ బాయ్‌గా వెలుగొందిన తరుణ్.. ప్రస్తుతం ఆఫర్స్ లేక హీరోగా రాణించడం లేదు. తాను హీరోగా ఉన్న టైంలో ప్రియమణితో ప్రేమయాణం నడిపాడని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. వన వసంతం మూవీ టైంలో వీరిద్దరూ కలిసి ప్రేమలో మునిగి తేలారని టాక్? అనంతరం వీరిద్దరూ చాలా క్లోజ్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు కొట్టాయి. ఇక వీరిద్దరు పెళ్లి చేసుకోవడమే తరువాయి అన్న టాక్స్ వినిపించాయి.

rumors have it that priyamani is going to marry Tarun

Advertisement

Priyamani : వారిద్దరి పెళ్లికి హీరో తల్లి ఓకే చెప్పింది..

ఒక రోజు ప్రియమణితో మాట్లాడిన తరుణ్ వాళ్ల అమ్మ.. మీరు నిజంగానే ప్రేమించుకుంటే చెప్పండి. నా కెలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట. పెళ్లి కూడా జరిపిస్తాననని చెప్పిందట. అందుకు ప్రియమణి స్పందిస్తూ అలాంటిదేమీ లేదు ఆంటీ అని చెప్పుకొచ్చింది. మేమిద్దం మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. సోషల్ మీడియాలో వచ్చే ఆ వార్తలు నమ్మకండి అంటూ ఆమెకు చెప్పిందట ప్రియమణి. దీనిపైనా కొందరు రూమర్స్ క్రియేట్ చేశారు. ఇదిలా ఉండగా మ్యారేజ్ తర్వాత సైతం మూవీస్‌లో యాక్ట్ చేస్తూ బిజీగా గడుపుతోంది ప్రియమణి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి