
Rumors of a breakup Young hero strong answer
Arjun Kapoor : సినిమా వాళ్లకు బ్రేకప్స్ కొత్తేమి కాదు. గత ఏడాది నాగ చైతన్య, సమంత తమ వివాహా బంధానికి బ్రేకప్ చెప్పగా ఈ ఏడాది అర్జున్ కపూర్, మలైకా అరోరా విడిపోతున్నట్టు జోరుగా వార్తలు వచ్చాయి. అర్జున్ కపూర్ ప్రముఖ నటి మలైకా అరోరాతో కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలైకాకు 48 ఏళ్లు కాగా.. అర్జున్ కపూర్‌కు 36 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య 12 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. తనకన్నా వయసులో పెద్దదైన మలైకతో అర్జున్ ప్రేమ వ్యవహరంతో ఎప్పుడు వార్తలలో నిలుస్తూనే ఉండడమే కాక పలుమార్లు ట్రోలింగ్‌కి కూడా గురవుతుంటాడు.
ఈ జంటపై ఎంత ట్రోలింగ్ జరిగిన అర్జున్ కపూర్ కానీ, మలైకా కానీ ఇంతవరకు స్పందించలేదు. ఎవరేమనుకున్నా మాకేంటి అనే ధోరణిలో ఈ జంట చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సహజీవనం చేస్తున్నారు. తరచుగా అర్జున్ కపూర్, మలైకా వెకేషన్స్ కి వెళ్లడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇద్దరూ బీచ్ లో జంటగా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముంబైలో కూడా ఈ ఇద్దరు పబ్లిక్‌గానే తిరుగుతూ ఉంటారు. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఈ ఇద్దరు తమ రిలేషన్‌షిప్ కొనసాగిస్తుండగా, రీసెంట్‌గా ఈ ఇద్దరు విడిపోతున్నట్టు జోరుగా ప్రచారాలు నడిచాయి.
Rumors of a breakup Young hero strong answer
తాజా రూమార్లకు చెక్ పెడుతూ అర్జున్ ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చాడు. మలైకాతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన అర్జున్ కపూర్.. చెత్త పుకార్లకు చోటు లేదంటూ తేల్చి చెప్పాడు. ‘నీచమైన పుకార్లకు ఇక్కడ చోటు లేదు. సురక్షితంగా, సంతోషంగా ఉండండి. లవ్ యూ ఆల్’ అనే క్యాప్షన్‌తో రూమర్లకు స్పష్టత ఇచ్చాడు అర్జున్ కపూర్. మలైకాతో ఉన్న మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేయడం ద్వారా వీరిద్దరూ విడిపోతున్నారన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం అయింది. అర్జున్ పోస్ట్‌పై మలైకా కూడా స్పందించారు. హార్ట్ ఎమోజీ పోస్ట్ చేసి తమ మధ్య బంధం బాగుందని పేర్కొన్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.