Saddam Hussein : బుల్లితెరపై తనదైన హాస్యం పంచుతూ ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్న షో కామెడీ స్టార్స్ ధమాకా. జబర్ధస్త్‌కి పోటీగా ఈ షోని రన్ చేస్తున్నారు. ఈ షోకి నాగబాబు, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. సద్ధాం, అవినాష్, ధనరాజ్, వేణు వంటి వారు తమ స్కిట్స్ తో తెగ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ ఆదివారం ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో సద్దాం సింగింగ్ ప్రోగామ్‌కి స్కిట్ చేశారు. ఇందులో సద్ధాం జడ్జిగా వ్యవహరించారు. పాట ఎలా పుడుతుంది, ఎలా పాడాలి అంటూ గత కార్యక్రమాలని స్పూఫ్‌లా చేస్తూ వినోదం పంచారు.ఇందులో కామెడీ కాస్త శృతి మించిందని, సెటైర్స్ మరి ఓవర్ అయ్యాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ స్కిట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ఈ ప్రోగ్రాంలో అవినాష్ కూడా సందడి చేశాడు. తన పెళ్లి కి రాని వాళ్ల కోసం రెండోపెళ్లి చేసుకుంటా అన్నాడు. అంతేకాదు విష్ణు ప్రియపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడు కామెడీ స్టార్స్ ధమాకా అంటూ కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇందులో యాంకర్ వర్షిణి తీసేసి శ్రీముఖిని పెట్టారు. ఇప్పుడు శ్రీముఖిని తీసేసి దీపిక పిల్లిని తీసుకొచ్చార. జడ్జ్‌గా శ్రీదేవిని తీసేసి నాగబాబును పట్టుకొచ్చారు. మధ్యలో అవినాష్ కూడా కొన్ని రోజులు కనిపించలేదు. షోలోంచి అవినాష్ బయటకు వెళ్లాడా? అనే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే కొన్ని రోజులకు అవినాష్ కనిపించాడు.జబర్దస్త్, పటాస్, అదిరింది వంటి కామెడీ షోలతో పాపులర్ అవుతున్న కమెడియన్లు.
. సినిమాలలో కంటే ఎక్కువ సంపాదిస్తూ సొంతంగా సినిమాలు చేసే స్థాయికి చేరుకుంటున్నారు. ఈ ప్రయాణంలో షకలక శంకర్, సుడిగాలి సుధీర్, ధనరాజ్, చమ్మక్ చంద్ర, గెటప్ శీను, ఆటో రాం ప్రసాద్, అదిరే అభిలు హీరోలుగా మారగా.. కొంతమంది దర్శకులుగా కూడా తమ టాలెంట్‌ను పరీక్షించుకోబోతున్నారు.పటాస్ షోతో పాపులర్ అయిన సద్దాం హుస్సేన్ అదిరింది కామెడీ షోతో బాగా పాపులర్ అయ్యారు. గల్లీ బాయ్స్ అంటూ అదిరిందిలో మనోడు చేసే రచ్చ మామూలుగా లేదు. జబర్దస్త్‌లో హైపర్ ఆది ఎలాగో.. అదిరిందిలో సద్దాం కూడా అంతే అన్నట్టుగా మనోడు స్కిట్లు బాగా పేలుతున్నాయి. ఇప్పుడు కామెడీ స్టార్స్ ధమాకాలో తెగ అదరగొట్టేస్తున్నాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.