Home » Entertainment » Sai Pallavi Apologise To A Star Hero Who Was Angry On Her
Entertainment

Sai Pallavi : ఆ స్టార్ హీరోకు సారీ చెప్పిన సాయిపల్లవి.. ఇప్పుడైనా కూల్ అయ్యాడా గురుడు?

Authored By
mallesh
The Telugu News | Updated on: September 26, 2022 12:25 pm
Advertisement

Sai Pallavi : మళయాల బ్యూటీ సాయిపల్లవి గురించి ఈ మధ్యకాలంలో నెగెటివ్ వార్తలు చాలా వస్తున్నాయి.. విరాటపర్వానికి సినిమాకు ముందు ఆమెపై ఇలాంటి కామెంట్స్ ఎన్నడూ రాలేదు. విరాటపర్వం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చేసిన కామెంట్స్ వాస్తవాలు తెలియకుండా మాట్లాడి ఒక వర్గాన్ని దోషులుగా చిత్రీకరించిందని కొన్ని సంఘాలు ఫైర్ అయ్యాయి. దీనికి తోడు ఆమెకు తలపొగరు చాలా ఉంటుందని ఓ స్టార్ హీరో తాజాగా కామెంట్ చేశాడట.. దీనిపై సాయిపల్లవి బహిరంగంగా సారీ చెప్పాల్సి వచ్చింది.

Advertisement

Sai Pallavi : సాయిపల్లవి ఏం తప్పు చేసింది.

సాయి పల్లివి ఇండస్ట్రీలో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మెయిన్‌గా తెలంగాణ యాసలో మాట్లాడి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది.ఇక ఆమెకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల అని చెప్పవచ్చు. రీసెంట్‌‌గా లవ్ స్టోరీ మూవీతో సాయి పల్లవికి మరోహిట్ అందించాడు ఈ దర్శకుడు..అయితే, వరుసగా సినిమాలు హిట్ అవుతుండటంతో ఆమెకు పొగరు పెరిగిందని టాక్ వినిపిస్తోంది. ఫిదా సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన సాయి పల్లవి ఆ తర్వాత మంచి కథలను ఎంపిక చేసుకుంటూ వెళ్లింది. ఇటీవల ఆమె నటించిన విరాటపర్వం, గార్గి చిత్రాలు పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోకపోయినా నటనా పరంగా ఆమెకు పెద్దపీట వేశాయి.

Sai Pallavi Apologise To A Star Hero Who Was Angry On Her

Advertisement

సాయి పల్లవి కేవలం తన నటనతోనే కాదు. డ్యాన్స్ తోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇదిలాఉండగా సాయి పల్లవిపై ఓ స్టార్ హీరో గుర్రుగా ఉన్నాడట.. ఆమె ప్రవర్తనపై కస్సుబుస్సు మంటున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే అతనితో సినిమా చేసే సమయంలో ఆమె ఎప్పుడూ సరిగా షూటింగ్‌కు టైంకు రాలేదని కోపంగా ఉన్నట్టు తెలిసింది. ఇదే విషయంపై సాయిపల్లవి స్టేజీ మీద బహిరంగ క్షమాపణ కోరిందట.. ‘కావాలని నా వల్ల తప్పు జరగలేదు. తెలియకుండా జరిగిపోయింది. ఐయామ్ సారీ అని చెప్పంది’.. అయితే ఇది ఆ హీరో కోసమే అని కూడా అంటున్నారు. సాయిపల్లవి సారీతో అయినా ఆ హీరో కూల్ అవుతాడో లేదో చూడాలి మరి..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి