Sai Pallavi latest movie update
Sai Pallavi : హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మొదటి సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ ఫిదా ‘ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడిగా నటించి అందరిని ఫిదా చేసింది. ఈ సినిమాలో తన డైలాగ్స్, నటన, అందాలకు ప్రేక్షకులు పడిపోయారు. ఈ సినిమా హిట్ తర్వాత తెలుగులో వరుసగా ఎన్నో సినిమాలను చేసింది సాయి పల్లవి. ఇప్పటివరకు సాయి పల్లవి చేసిన అన్ని సినిమాలలో సాంప్రదాయ బద్ధమైన పాత్రలు చేస్తూ ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించింది.
ఈ అమ్మడు కేవలం తెలుగులోనే కాకుండా వివిధ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. తెలుగులో తన నటనకు లేడీ పవర్ స్టార్ ట్యాగ్ ను తగిలించారు అభిమానులు. ఇంతవరకు ఏ హీరోయిన్ కి ట్యాగ్ లేదు కాని సాయి పల్లవికి ఏకంగా లేడీ పవర్ స్టార్ బిరుదు ఇచ్చారు. అందుకే సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ మారిపోయింది. ఏ సినిమాలో అయినా హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందో అటువంటి సినిమాలను చేయడానికి ఈ అమ్మడు ఇష్టపడుతుంది. ఇంతవరకు ఏ సినిమాలో ఎక్స్పోజింగ్ ఇవ్వలేదు.
Sai Pallavi latest movie update
తెలుగులో సాయి పల్లవి ఆఖరిగా చేసిన సినిమా విరాటపర్వం. ఈ సినిమాలో హీరోగా దగ్గుపాటి రానా నటించాడు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. అయితే ఈ అమ్మడు త్వరలోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న ఓ సినిమాలో సాయి పల్లవికి అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటించనుండగా, సీత పాత్రలో సాయి పల్లవి నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Turmeric Water Bath : స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేశారంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి…
Uppal : ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మందుముల పరమేశ్వర్రెడ్డి mandumula parameshwar reddy, కృషి ఫలించింది. ఫలితంగా…
Today Gold Rates : గత కొంతకాలంగా పరుగులు పెడుతూ రికార్డు స్థాయిలకు చేరిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం…
Mutton Bone Soup : పాతకాలం నుంచి ఇప్పటివరకు కూడా ఎవరికైనా ఎముకలు విరిగిన లేదా కీళ్ల నొప్పులు ఉన్న,మోకాళ్ళ…
Yamadharma Raja : జనన మరణములు తథ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.ఇది ప్రతి ఒక్కరికి తెలిసినదే. మరణం…
Farmers : ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద కేంద్ర ప్రభుత్వం కీలక చర్యకు శ్రీకారం చుట్టింది.…
Funnel Seeds : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా డయాబెటిస్ మారిన పడుతూనే ఉన్నారు. వారి సంఖ్య రోజుకి…
Guava Leaf Tea : ప్రస్తుత కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉండాలని కొన్ని రకాల టీ…
This website uses cookies.