sai pallavi who cried yours on stage for the work done by the fans
Sai Pallavi : సాయి పల్లవి.. ఈ పేరుకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నేచురల్ యాక్టింగ్ తో సినిమా ఫీల్డ్ లో మంచి పేరు తెచ్చుకుంది. తన పాత్రకు స్కోప్ ఉంటే తప్ప కేవలం గ్లామర్ కోసం నటించనని ఎన్నో సార్లు చెప్పేసింది సాయి పల్లవి. అందుకే ఆమె చేసిన ప్రతి పాత్ర కూడా గుర్తుండిపోయేలా చూసుకుంటోంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలో ఆఫర్ వచ్చినా సరే.. తన పాత్రకు గుర్తింపు వస్తుంది అనుకుంటనే చేస్తానని ఈ భామ ఖరాకండిగా చెప్పేస్తుందంట. ఆ వ్యవహారమే ఆమెకు ఇంకా అవకాశాలు వచ్చేలా చేస్తోందని ఆమె ఫ్యాన్స్ అనుకుంటారు.
అయితే తాజాగా సాయి పల్లవి స్టేజిమీద ఏడ్చేయడం నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆమె నాని సరసన శ్యామ్ సింగరాయ్‌లో నటిస్తోంది. ఇందులో కృతిశెట్టి మరో హీరోయిన్‌గా చేస్తోంది. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ష న్‌లో తెరకెక్కిన ఈ మూవీలో నాని డబుల్ రోల్‌లో నటించాడు. అయితే ఈ సినిమా మీద భారీగానే అంచనాలు ఉన్నాయి. 1970 నాటి కాలంలో జరిగిన ఘటనల మీద సినిమా ఉండటంతో హైప్ వచ్చేసింది. కాగా ఈ మూవీని డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నారు. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ లో సాయి పల్లవి మాట్లాడుతూ ఏడ్చేసింది.
sai pallavi who cried yours on stage for the work done by the fans
అభిమానులు తన మీద ఇంతలా అభిమానం చూపిస్తున్నారంటూ ఎమోషనల్ అయింది. సాయి పల్లవి స్టేజి మీదకు రాగానే ఫ్యాన్స్ గట్టిగా అరుస్తూ ఒక హీరోను చూస్తే ఎంతలా కేకలు వేస్తారో సాయి పల్లవిని చూస్తే కూడా అలాగే కేకలు వేయడంతో ఆమె నామీ ఇంత ప్రేమను చూపిస్తున్న అభిమానుల ప్రేమాభిమానాలకి థాంక్స్ అంటూ ఏడ్చేసింది. తాను ప్రతి సినిమాను ఎంతో ఇష్టంగా చేస్తున్నానని, తన కష్టమే తనకు ఈ పేరు తెచ్చిందంటూ ఏడ్చేసింది. ఇక ఏడుస్తూనే నానిని వెళ్లి హత్తుకోవడం, అతను ఓదార్చడం ఇందులో మనకు కనిపిస్తుంది.
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
This website uses cookies.