Home » Entertainment » Saiee Manjrekar Getting Chances In Tollywood
Entertainment

సాయీ మంజ్రేకర్ టాలీవుడ్ హీరోలకి సాలీడ్ గా దొరికేసింది. !

Authored By
vamana sai
The Telugu News | Updated on: January 16, 2021, 10:43 am
Advertisement

సాయీ మంజ్రేకర్ బాలీవుడ్ లో చేసింది ఒకే ఒక్క సినిమా. కాని సాలీడ్ హిట్ అందుకుంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 సినిమా ద్వారా సాయీ మంజ్రేకర్ బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమా సూపర్ హిట్. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలందరు ఈ హాట్ బ్యూటీని తెగ పొగిడేశారు. ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైంది సాయి మంజ్రేజర్. ఒక్క సినిమాతోనే బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

Advertisement

 

అయితే ఇప్పుడు బాలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే సాయీ మంజ్రేకర్ జపం చేస్తున్న వాళ్ళు ఎక్కువమంది ఉన్నారు. అందుకు కారణం ఈ హాట్ బ్యూటీకి టాలీవుడ్ లో వరసగా అవకాశాలు దక్కుతుండటమే. చెప్పాలంటే సాయీ మంజ్రేకర్ కి మంచి బ్యాక్ గ్రౌండే ఉంది. తండ్రి మహేష్ మంజ్రేకర్ తెలుగు, హిందీ సినిమాలలో పాపులర్ నటుడు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత కి సాయీ మంజ్రేకర్ అత్యంత సన్నిహితురాలు. ఇంకేముంది తెలుగులో వసరగా సినిమా ఛాన్సులు దక్కించుకుంటోంది.

Advertisement

saiee manjrekar getting chances in tollywood

ఇప్పటికే సాయి మంజ్రేకర్ అడవి శేష్ తో మేజర్ అన్న సినిమా చేస్తోంది. ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాత. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న బాక్సర్ సినిమా లో కూడా హీరోయిన్ గా సాయీ మంజ్రేకర్ నటిస్తోంది. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్. కాగా తాజాగా సాయీ మంజ్రేకర్ .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జంటగా నటించే ఛాన్స్ అందుకుందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయీ మంజ్రేకర్ ని తీసుకున్నారట. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వస్తుందని అంటున్నారు.

Advertisement

 

 

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి