Home » Entertainment » Saiee Manjrekar Is Encouraged By Her Father
Entertainment

Saiee manjrekar : సాయి మంజ్రేకర్‌ ను తెలుగులో హీరోయిన్‌గా ఎంకరేజ్ చేసింది మహేష్ బాబు కాదా..?

Authored By
vamana sai
The Telugu News | Updated on: April 28, 2021 8:39 pm
Advertisement

Saiee manjrekar : సాయి మంజ్రేకర్‌ .. బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సిరీస్ దబాంగ్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా ఉన్నప్పటికి సాయీ మంజ్రేకర్‌కి మంచి క్రేజ్ అండ్ పాపులారిటీ వచ్చేసింది. డెబ్యూ సినిమానే స్టార్ హీరో..స్టార్ కో స్టార్స్‌తో కలిసి నటించడం బాగా ప్లస్ అయింది. ఆచితూచి బాలీవుడ్ సినిమాలు చేస్తున్న సాయీ మంజ్రేకర్ టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశం వరించింది.

Advertisement

దాంతో అందరు సాయీ మంజ్రేకర్ టాలీవుడ్ ఎంట్రీకి సూపర్ స్టార్ మహేష్ బాబు అనుకున్నారు. అందుకు కారణం కూడా బలంగానే కనిపించాయి. మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ సాయీ మంజ్రేకర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితురాలు. ఆ రకంగా కొన్నేళ్ళుగా రెండు ఫ్యామిలీస్ మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే నమ్రత ..మహేష్‌తో రికమండ్ చేసి ఆయన నిర్మాణంలో తెరకెక్కుతున్న మేజర్ సినిమాలో అవకాశం కల్పించిందని అనుకున్నారు. ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటిస్తుండగా పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కుతోంది.

saiee-manjrekar is encouraged by her father

Advertisement

Saiee manjrekar : సాయి మంజ్రేకర్ తండ్రి ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్.

అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమాలో కూడా సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే సాయీ మంజ్రేకర్ టాలీవుడ్ ఎంట్రీకి కారణం మహేష్ బాబు కాదని తన తండ్రి అని వెల్లడించింది. సాయి మంజ్రేకర్ తండ్రి ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్. ఆయన బాలీవుడ్ సినిమాలలోనే కాకుండా టాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. ఆ కారణంగానే సౌత్ సినిమాలలో నటించమని ఎంకరేజ్ చేశాడట. మొత్తానికి తండ్రి ఎంకరేజ్‌మెంట్ వల్లే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ట్రై చేస్తోందనమాట.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి