Home » Entertainment » Salman Khan Fire On Godfather Movie Team
Entertainment

Salman Khan : ప‌రువు తీసారంటూ గాడ్ ఫాద‌ర్ టీమ్‌పై సల్మాన్ ఖాన్ ఆగ్ర‌హం

Authored By
Sam C
The Telugu News | Updated on: September 19, 2022 8:00 pm
Advertisement

Salman Khan : కుర్ర‌హీరోల‌కు పోటీగా మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ప్ర‌స్తుతం మోహన్ రాజా డైరెక్ష‌న్‌లో గాడ్ ఫాద‌ర్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించారు. సల్మాన్ నటించడంతో ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారని ప్రచారం జరిగింది.

Advertisement

Salman Khan : ఆగ్ర‌హంతో ఉన్న స‌ల్మాన్..

అయితే ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసేందుకు గాడ్ ఫాద‌ర్ టీం ఓ అడుగు వెన‌క్కి వేసిన‌ట్టు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గానే స‌ల్మాన్ చిత్ర బృందంపై ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. సినిమా యొక్క అవుట్ ఫుట్ విషయంలో తీవ్రంగా నిరాశతో ఉన్నాడట స‌ల్మ‌న్ . తన లుక్ తోొ పాటు… సినిమాలో తన సన్నివేశాలు మరియు ఇతర నటీ నటులు సన్నివేశాలు దారుణంగా ఉన్నాయ‌ని, త‌న పాత్ర‌ని ఎందుకు ఇలా చేశారంటూ స‌ల్మాన్ కోప‌గించుకున్న‌ట్టు ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Salman Khan Fire On GodFather Movie Team

Advertisement

తెలుగు సినిమాలో న‌టించినందుకు త‌న ప‌రువు పోయేలా చేశారంటూ కొంద‌రి ద‌గ్గ‌ర వాపోయాడ‌ట స‌ల్మాన్. పొరటాపాటున కూడా హిందీలో ఈ సినిమా రిలీజ్ చేయవద్దంటూ సన్మాన్ సలహా కూడా ఇచ్చినట్టు చెపుతున్నారు. ఈ విషయాన్ని ఆయన నిర్మాతలకు సూచించాడట. మొన్నటి వరకు అనంతపురంలో జరగబోతున్న గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో సల్మాన్ ఖాన్ పాల్గొంటాను అంటూ చెప్పుకొచ్చారు. కాని సల్మాన్ భ‌ద్రత విషయంలో సమస్యలు ఎదురవుతాయని ఆయన పాల్గొనే అవకాశం లేదంటూ తేలడంతో సల్మాన్ డ్రాప్ అయినట్టు తెలుస్తోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి