
Salman Khan Region Ram Charan on Tollywood Stars
Salman Khan: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోకు లేని బంధం కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు మెగా ఫ్యామిలీతో ఉంది. చిరు గానీ, చరణ్ గానీ ఒక్క మాట అడగాలే గానీ, తాను ఎంత బిజీగా ఉన్నా ముంబై నుంచి హైదరాబాద్‌లో మెగా ఫ్యామిలీలో దర్శనమిస్తారు. అంత అటాచ్‌మెంట్ ఉంది భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్‌కు. అయితే, ఇప్పుడు ఎక్కువగా మన టాలీవుడ్ స్టార్స్‌మీద ఫోకస్ పెట్టారు. తన సినిమాలలో మన వారిని మన వాళ్ల సినిమాలలో సల్మాన్ కుండ మార్పిడి మాదిరిగా సినిమాల్లో నటిస్తూ నటింపజేస్తున్నారు.హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘కభీ ఈద్ కభీ దివాళి’ సినిమాలో ఇప్పటికే మన టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, సీనియర్ హీరో జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఈ రెండు మూడు రోజుల నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అంతేకాదు, ఇక్కడ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా వెలుగుతున్న పూజా హెగ్డేకు మళ్ళీ హిందీలో రీ ఎంట్రీ ఛాన్స్ ఇచ్చింది సల్మాన్ కావడం విశేషం. అలాగే, 2005లో వచ్చిన నో ఎంట్రీ సినిమా సీక్వెల్ నో ఎంట్రీ మే ఎంట్రీ సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సల్మాన్. ఈ సినిమాలో అనిల్ కపూర్, ఫర్ధీన్ ఖాన్ కూడా నటిస్తుండగా ముగ్గురూ ట్రిపుల్ రోల్‌లో కంపించబోతున్నారు.అందుకే ఈ సినిమాలో 10 మంది హీరోయిన్ ఉంటారని ప్రచారం అవుతోంది. వీరిలో ఎక్కువగా సౌత్ స్టార్ హీరోయిన్స్ నటిస్తారని లేటెస్ట్ టాక్. వారిలో ఇప్పటికే.
Salman Khan Region Ram Charan on Tollywood Stars
సమంత.. రష్మిక మందన్న.. కృతి శెట్టి, ప్రగ్యా జైస్వాల్ లాంటి వారిని సల్మాన్ టీమ్మ్ సంప్రదించారట. ముఖ్యంగా సమంత, రష్మిక ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఎక్కువగా సల్మాన్ ఇలా టాలీవుడ్ స్టార్స్ మీద ఫోకస్ పెట్టడానికి కారణం ఇక్కడ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని తెలుస్తోంది. ఇప్పటికే చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ సంస్థలో మెగాస్టార్‌తో పాటు ఇతర చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇదే సంస్థకు సల్మాన్ సంస్థను కలిపి టాలీవుడ్, బాలీవుడ్‌లో కలిసి సినిమాలు నిర్మిచేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌ను హిందీలో సల్మాన్ టీం మానీటర్ చేస్తే, తెలుగులో చరణ్ టీమ్మ్ మానీటర్ చేస్తుందట. అందుకే, ఇప్పుడు సల్మాన్ ఫోకస్ ఎక్కువగా టాలీవుడ్‌పై ఉందని చెప్పుకుంటున్నారు. ఇక మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతీ తెలిసిందే.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.