Home » Entertainment » Samanta Naga Chaitanya New Update
Entertainment

Samanta – Naga chaitanya : సమంత – నాగ చైతన్య పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నారా..?

Authored By
vamana sai
The Telugu News | Updated on: September 29, 2021 10:12 pm
Advertisement

Samanta – Naga chaitanya: సమంత – నాగ చైతన్యల మధ్య మనస్పర్థలు వచ్చాయని, విడాకులు తీసుకొని విడిపోతున్నారని సోషల్ మీడియాలో ఒకటే వార్తలు వచ్చి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గతకొన్నాళ్లుగా ఇద్దరూ వేరుగా ఉంటున్నారని..ఇప్పటికే ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరిని కాంప్రమైజ్ కావడానికి చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. దానికి సమంత కూడా బలాన్ని చేకూరేలా తన సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని కామెంట్స్ పెడుతూ అందరి అనుమానాలను పెంచుతూ వస్తోంది. ఆ కామెంట్స్ ఆధారంగా ఎవరికి వచ్చినట్టు వారు రాసేసుకుంటున్నారు. నాగ చైతన్య గానీ, సమంత గానీ ఈ వార్తలకి స్పందించడం లేదు.

Advertisement

Samanta Naga chaitanya New update

కాబట్టి అందరూ ఇదే నిజం..రేపో మాపో సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకోవడం ఖాయమని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే సమంత ముంబైలో ఇల్లు కూడా కొనిందని..విడాకులు రాగానే హైదరాబాద్‌ నుంచి ముంబైకి మకాం మార్చేస్తుందని టాక్ వచ్చింది. ఇవన్ని రూమర్స్ అని తాజాగా సమంత తేల్చేసింది. గత ఏడాది ఆమె సాకి అనే ఉమెన్స్‌కి సంబంధించిన బిజినెస్ మొదలు పెట్టింది. ఇది మొదలు పెట్టి ఏడాది పూర్తైన సందర్భంగా ఆమె అభిమానులతో మాట్లాడి..తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో ఆస్క్ మీ యువర్ క్వశన్స్..అంటూ చిట్ చాట్‌కి ఆహ్వానించింది సమంత.

Advertisement

samantha akkineni about on naga chaitanya

Samanta – Naga chaitanya: ఇదే నిజమైతే అక్కినేని అభిమానులకి పెద్ద పండుగే.

ఈ చిట్ చాట్‌లో సమంత అనుకున్న ప్రశ్నలన్ని వెల్లువెత్తాయి. వాటికి సమాధానం చెప్పి దాదాపు అన్నిటికీ చెక్ పెట్టేసింది. ఒక్క మాటలో నేను హైదరాబాద్ వదిలి ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇక్కడే నా ఇల్లు. అని విడాకులపై వస్తున్న రూమర్స్‌కి ఇన్‌డైరెక్టర్‌గా చెక్ పెట్టింది. అలాగే విడాకుల విషయంలో అడగగా..వస్తున్న రూమర్స్‌లో ఇది కూడా ఒకటి అన్నట్టుగా సమాధానం చెప్పింది. అయితే ఇప్పుడు తాజాగా మరో టాక్ వినిపిస్తోంది. సమంత – నాగ చైతన్య పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నారట. అందుకే ఇప్పుడు సమంత చేస్తున్న తమిళ సినిమా తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే అక్కినేని అభిమానులకి పెద్ద పండుగే.

Advertisement

Samantha And Sadhna Singh Conversation

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి