Home » Entertainment » Samantha Answer To Oo Antava Mawa Song
Entertainment

Samantha : ఊ అంటావా సాంగ్ ఎందుకు చేసావ‌న్నందుకు బూతుతో స‌మాధానం ఇచ్చిన స‌మంత‌

Authored By
Sam C
The Telugu News | Published on: July 22, 2022, 8:30 pm
Advertisement

Samantha : విడాకుల తరువాత సమంత అన్ని హద్దులు చెరిపేస్తూ..తనకు నచ్చిన విధంగా ఉంటుంది. ఇష్టమైన వాళ్ళతో తిరగడం..నచ్చిన వాళ్లతో టూర్ లకి వెళ్ళడం..అబ్బో లైఫ్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది సమంత అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాల పరంగా కూడా అమ్మడు..ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. కాఫీ విత్ కరణ్ 7 షోలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత .. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‏తో కలిసి సందడి చేసింది. పుష్ప చిత్రంలో సామ్ నటించిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాటకు అక్షయ్‏తో కలిసి స్టెప్పులేసింది. ఇందులో సామ్ తన వ్యక్తిగత జీవితం.. కెరీర్.. పెళ్లి.. విడాకుల పై స్పందించింది.

Advertisement

Samantha : షాకింగ్ ఆన్స‌ర్..

అలాగే టాలీవుడ్ నెపోటిజం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలుగు చిత్రపరిశ్రమలో చాలా మంది హీరోస్ తమ పిల్లలు, బంధువులు మాత్రమే హీరోలు అవుతారని.. విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులు స్టార్ గా మారడం చాలా అరుదు అని అన్నారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా సినిమాలు డిజాస్టర్ అయినా.. నేను ఫెయిల్ అయితే మా అమ్మ నాన్నలకు, సోదరులకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఒక స్టార్ హీరో పిల్లలు ఫెయిల్ అయితే దేశం మొత్తం తెలిసిపోతుంది. వారిని ఎప్పుడూ ట్రోల్ చేస్తారు. వారసత్వంతో పోలుస్తారు. సూపర్ స్టార్స్ అందరూ గొప్ప నటులని.. గొప్ప నటులందరూ సూపర్ స్టార్స్ అని తాను అనుకోవడం లేదని పేర్కొంది స‌మంత‌.

Samantha Answer to oo antava mawa song

Advertisement

ఇక పుష్ప సినిమా కోసం స‌మంత స్పెష‌ల్ సాంగ్ చేయ‌డం వెన‌క కార‌ణం ఏంట‌ని క‌ర‌ణ్ జోహార్ ప్ర‌శ్నించ‌గా, ఎఫ్ అనే వ‌ర్డ్ యూజ్ చేస్తూ తాను చేస్తాన‌ని నిరూపించేందుకే ఈ సాంగ్ చేసాన‌ని పేర్కొంది. నిజానికి ఈ పాట మగ చూపులపై సెటైర్ గా ఉంటుంది. నాచ్ గర్ల్ గా చేస్తున్న నా లాంటి పెద్ద స్టార్ కాకపోతే మగ చూపులపై ఇంకెవరు సెటైర్ వేయగలరు?” అని సమంత చెప్పింది. షోలో సామ్ స్టేట్మెంట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం గురించి ఓ బాలీవుడ్ మీడియా రాసిన ఆర్టికల్ ను సామ్ ట్విట్టర్ లో షేర్ చేయడం గమనార్హం.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి