samantha appoints new manager
Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య సమంత నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత విడిపోయారు. అక్టోబర్ 2న ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకోగా, వారి నిర్ణయం అభిమానులని చాలా కలచివేసింది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. విబేధాల వలన కలిసి ఉండలేమని చెప్పుకొచ్చారు. ఇక వీరి వివాహం టాలీవుడ్ లోనే గ్రేట్ వెడ్డింగ్ లో ఒకటిగా జరిగింది. రెండు రోజులు , రెండు రిలీజియస్ పద్దతిలో వీరు వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ తో పాటు మిగతా ఇండస్ట్రీల వారు కథలు కథలుగా చెప్పుకున్నారు. అప్పట్లో సామ్ పెళ్లి చీర టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. పెళ్లిలో సమంత కూడా చాలా సంతోషంగా కనిపించింది. తర్వాత కూడా ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. ఏమైందో ఏమో కాని సడెన్‌గా విడాకుల నిర్ణయం తీసుకున్నారు.
చైతూ నుండి విడిపోయిన తర్వాత సమంత మెల్లమెల్లగా అతని జ్ఞాపకాలని చెరిపేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఆయనని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసిన సమంత అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున,రానా, వెంకటేష్ కుమార్తె ఆశ్రితలను ఇంకా ఫాలో అవుతుంది. అయితే సమంత తన పెళ్లి చీర, చైతన్యకు సంబంధించిన ప్రతి వస్తువును ఆమె అక్కినేని కుటంబానికి తిరిగి ఇచ్చేసిందట. చైతు జ్ఞాపకాలను కనీసం గుర్తుతెచ్చే ఏ వస్తువును సామ్ దగ్గరికి కూడా రానివ్వడం లేదట. తాజాగా మరో స్టెప్ వేసింది ఈ ముద్దుగుమ్మ.సమంత, అక్కినేని నాగచైతన్య..
samantha appoints new manager
ఈ ఇద్దరికీ ఒకరే మేనేజర్ వుండేవారు అయితే, ఇప్పుడు ఆ మేనేజర్‌ని బాధ్యతల నుంచి తప్పించిందట సమంత. నాగచైతన్యతో పరోక్షంగా వున్న ఆ చిన్న కనెక్షన్ కూడా తొలగించేసుకుంది సమంత. ముంబై నుంచి తాజాగా ఓ మేనేజర్‌ని నియమించుకుందట సమంత రూత్ ప్రభు. ఆ మేనేజర్ పర్యవేక్షణలోనే కొత్త ప్రాజెక్టులు, నడుస్తున్న ప్రాజెక్టులు వుంటాయట. ఇదిలా ఉంటే సమంత, చైతూతో నందిని రెడ్డి ఓ ప్రాజెక్ట్ చేయాలని భావించిందట. కానీ వీళ్ళీద్దరు విడాకులు తీసుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌కు పోస్ట్ పోన్ అయింది. ఇక తాజాగా ఈ కథను చైతన్యకు వినిపించిందట. నాగ చైతన్య కూడా ఈ కథకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. సమంతని కూడా నందిని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్టు టాక్.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.