
Samantha : సెకండ్ హ్యాండ్ అని ఏవేవో ట్యాగ్‌లు నాకు తగిలించేవాళ్లు.. విడాకులపై సమంత కామెంట్
Samantha : దక్షిణాది బ్యూటీ సమంత ఇప్పటికీ టాలీవుడ్‌లో క్రేజీ భామగానే ఉంది. ఆమె ఇటీవల నటించిన వెబ్ సిరీస్ హనీబన్నీ అమెజాన్ ప్రైమ్ లో ఈనెల ఏడోతేదీ నుంచి ప్రసారమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో మిక్స్ డ్ టాక్, మరికొన్ని ప్రాంతాల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. హనీబన్నీకి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే విడాకులు తీసుకున్న తర్వాత మహిళలపట్ల సమాజం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టింది. కష్టకాలంలో తనకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఎంతో అండగా నిలబడ్డారని వ్యాఖ్యానించింది.
Samantha : సెకండ్ హ్యాండ్ అని ఏవేవో ట్యాగ్‌లు నాకు తగిలించేవాళ్లు.. విడాకులపై సమంత కామెంట్
నాగచైతన్య విడాకులు, ట్రోలింగ్ గురించి ఎదురైన ప్రశ్నకి సమంత సమాధానమిస్తూ.. ‘‘వివాహ బంధం విచ్ఛిన్నమైతే.. ఎందుకు మహిళల్నే నిందిస్తారు..? నాపై ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారు. సెకండ్ హ్యాండ్, యూజ్డ్ అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్‌లు కూడా కొంత మంది ఇచ్చారు. ఇలాంటి మాటలు బాధపెడతాయని కూడా ఆలోచించరా? ఏం చేస్తాం.. మనం ఇలాంటి సమాజంలో బతుకుతున్నాం. క్లిష్ట సమయంలో నా ఫ్యామిలీ, స్నేహితులు నాకు అండగా నిలిచారు’’ అని సమంత చెప్పుకొచ్చింది.నాగచైతన్య వివాహం వార్త వెలుగులోకి రాగానే సమంత కోపంతో తన పెళ్లి గౌనుని రీ-మోడల్ చేయిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఆమెకి ఎదురవగా.. ‘‘నేను కోపం లేదా ప్రతీకారంతో పెళ్లి గౌనును రీ-మోడల్ చేయించలేదు.
నిజానికి అలా చేయించేందుకు చాలా బాధపడ్డాను కూడా. కానీ.. కొన్ని విషయాల్లో జీవితం ఎక్కడైతే ముగుస్తుందో. మళ్లీ అక్కడే నుంచే ప్రారంభమవుతుంది’’ అని సమంత చెప్పుకొచ్చింది. ఇక సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో సమంతకి మయోసైటిస్ రావడంతో ఆ సిరీస్ నుంచి తప్పుకోవాలని తొలుత సమంత భావించింది. ఆ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకేకి కూడ ఆ విషయం చెప్పిన సమంత.. తన స్థానంలో కియారా అద్వానీ లేదా కృతి సనన్‌ని తీసుకోవాలని చెప్పిందట. కానీ.. రాజ్ అండ్ డీకే అందుకు అంగీకరించకుండా.. సమంత కోలుకునే వరకూ ఎదురుచూశారట. ఈ విషయాన్ని కూడా తాజా ఇంటర్వ్యూలో రివీల్ చేసింది..
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.