Samantha : డైరెక్టర్స్‌కి ఆ మెలిక పెట్టి చుక్కలు చూపిస్తున్న సమంత.. ఎందుకమ్మడు ఇలా?
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు సినిమాలకి బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. మయోసైటిస్ కారణంగా కొన్నాళ్ల నుండి సినిమాలకి దూరంగా ఉంటుంది సమంత. ప్రస్తుతం తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టింది. అనారోగ్య సమస్యల గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఒక పాడ్ కాస్ట్ కూడా నిర్వహిస్తుంది. ఇందులో తన ఆరోగ్యంతోపాటు తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది. నేను ఉదయం 5:30 గంటలకు మేల్కొంటాను. లేవగానే జర్నలింగ్ తో నా రోజును ప్రారంభిస్తాను. గ్రాటిట్యూడ్ జర్నల్ రాస్తాను. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు సూర్య కిరణాలను ఆస్వాదిస్తాను.అనంతరం బ్రీత్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తాను. ఇందు కోసం నేను విమ్ హోఫ్ మెథడ్ ఫాలో అవుతాను. నేను గత కొంతకాలంగా ఇషా క్రియా కూడా చేస్తున్నాను. 25 నిమిషాల పాటు మెడిటేషన్ కూడా చేస్తాను.
అలాగే కొద్ది నెలలుగా టాపింగ్ చేయడం వంటివి కూడా చేస్తున్నాను. ఇలా చేయడం వలన ఎనర్జీ బ్యాలెన్స్ చేయడానికి ఎంతో సాయం అవుతుంది. పెయిన్స్ నుండి రిలీఫ్ ఉంటుంది అని సమంత చెప్పుకొచ్చింది.సమంత ప్రస్తుతం అనారోగ్యం నుండి పూర్తిగా కొలుకున్నట్టు తెలుస్తుండగా, త్వరలో తిరిగి సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటుంది. మంచి మంచి కథలని ఎంచుకుంటున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు దర్శకులకి సమంత కొన్ని కండీషన్స్ పెడుతుందట.కమర్షియల్ చిత్రాలలో తాను మెయిన్ లీడ్ అయితే చేస్తానని సమంత అంటుందట. సెకండ్ హీరోయిన్ అయితే చేసే ప్రసక్తే లేదని అంటుందట. సమంత క్రేజ్ ఇప్పుడు కాస్త తగ్గిన సమయంలో కూడా ఇప్పుడు ఆమె ఇలాంటి కండీషన్స్ పెట్టడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
Samantha : డైరెక్టర్స్‌కి ఆ మెలిక పెట్టి చుక్కలు చూపిస్తున్న సమంత.. ఎందుకమ్మడు ఇలా?
ఇక సమంత త్వరలో సిటాడెల్ వెబ్ సిరీస్‌తో పలకరించనుంది. దీంతో సమంత నేషనల్ వైడ్‌గా మరింత పాపులారిటీ పెంచుకోవాలని అనుకుంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. యశోద, శాకుంతలం తర్వాత సమంత విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి అనే సినిమాను చేసింది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా విడుదలై సోసో అనిపించుకుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.