Home » Entertainment » Samantha Deletes Her Pictures With Naga Chaitanya In Social Media
Entertainment

Samantha ఆ ఫోటోలను తీసినంత తేలికా? ప్రేమను మరిచిపోలేం.. సమంత..!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 28, 2021, 8:50 pm
Advertisement

నాగచైతన్యతో విడిపోయిన సమంత.. ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. దేశ విదేశాలు తిరిగేస్తోంది. తనకిష్టమైన ప్రదేశాలను ఇష్టమైన స్నేహితులతో కలిసి వెళ్తుంది. విడాకుల ప్రకటన తర్వాత చైతన్యతో త‌న ఆ జ్ఞాపకాలను శాశ్వతంగా చెరిపివేసేలా అడుగులు వేస్తుంది. ఫ్యాన్స్‌కు కూడా తన టూర్ ఫొటోలను ఎప్పటికప్పుడూ షేర్ చేస్తోంది. కొత్త ప్రయాణాల వైపు అడుగులు వేస్తుంది. అయితే తాజాగా సమంత చైతుతో జ్ఞాపకాలను సోషల్ మీడియా నుంచి కూడా తొలగించే పనిలో పడింది. గతంలో చైతూతో గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్న సమంత.. తాజాగా వాటన్నింటినీ తన ఖాతాలోంచి రిమూవ్ చేసేసింది.

Advertisement

Samantha deletes her pictures with Naga chaitanya in social media

చైతూతో తన బంధానికి గుర్తుగా ఉన్న దాదాపు 80 ఫోటోలను ఆమె డిలీట్ చేసింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ – పెట్ డాగ్స్ తో ఉన్న ఫొటోలను కాకుండా..ఇద్ద‌రు కలిసి ఉన్న ఫోటోలను మాత్రమే మెల్ల‌గా తొల‌గిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ లెక్కన చూస్తే చైతూకి సంబంధించిన అన్ని జ్ఞాపకాలను శాశ్వతంగా చెరిపేయాలని సమంత ఫిక్సయినట్లు చెప్పుకోవచ్చు. చైతూతో ఉన్న ఫొటోలను తొలగించడం మాత్రం కాకుండా.. సోషల్ మీడియాతో చైతూను అన్ ఫాలో చేస్తుందేమో చూడాలి.

Advertisement

samantha in dubai

ప్రస్తుతం సమంత దుబాయ్‌లో ఉంది. తన ఫ్రెండ్స్ సాధన, ప్రీతమ్‌లతో కలిసి ఆమె దుబాయ్‌ వెళ్ళింది. సాధనా సింగ్ , ప్రీతమ్ తో కలిసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. భారత్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్ కోసం అక్కడికి వెళ్లినట్టు కనిపిస్తోంది. మొత్తానికి విడాకుల ప్రకటన తర్వాత సమంత దూసుకుపోతున్న తీరు జనాల్లో హాట్ టాపిక్ అయింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి