Home » Entertainment » Samantha Fitness Video Viral
Entertainment

Samantha : స‌మంత గ్లామ‌ర్ సీక్రెట్ ఇదేనా.. వామ్మో, ఎంత బ‌రువులు ఎత్తుతుంది..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 29, 2022, 10:00 pm
Advertisement

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో స‌మంత ఒక‌రు. ఈ అమ్మ‌డు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది సామ్. ఎప్పుటికప్పుడు ఫోటోషూట్స్.. మోటివేషనల్ కోట్స్… తాను ఎదుర్కోంటున్న మానసిక స్థితి గురించి నెట్టింట్లో పోస్టులు పెడుతుంటుంది. చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత ఈ అమ్మ‌డిలో చాలా మార్పులు గమ‌నిస్తున్నాం. అయితే ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. సామ్ మాత్రం తన ఫిట్‏నెస్ పై ఎక్కువగా కేర్ తీసుకుంటుంది. రోజూ జిమ్‏లో కష్టతరమైన వర్కవుట్స్ చేస్తూ ఉంటుంది.

Advertisement

స‌మంతకు సంబంధించిన ఫోటోస్.. వీడియోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. ఈ భామ క‌ష్ట‌త‌ర‌మైన వ‌ర్క‌వుట్స్ కూడా ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా చేస్తోంది. స్క్వాట్స్, ఏరోబిక్స్, ఏరియ‌ల్ యోగా..ఎలాంటి వ‌ర్క‌వుట్ అయినా అవ‌లీల‌గా చేసి ప‌డేయడం సామ్‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. అయితే స‌మంత ట్రైన‌ర్ జునైద్ షేఖ్ ఆమెకు ఎప్పుడూ ఒక్క‌టే చెబుతాడ‌ట‌. ఒక‌వేళ స‌మంత అథ్లెట్ (క్రీడాకారులు) అయితే విరాట్ కోహ్లీ లా ఉండేద‌ని చెబుతుంటాన‌ని చెప్పాడు. తను ఎంత కష్టమైన వ్యాయామం చెప్పినా.. నో అనకుండా.. మరోసారి చెయ్యి.. నేను ట్రై చేస్తాను అంటుంది అని చెప్పుకొచ్చాడు.

samantha fitness video viral

Advertisement

Samantha : స‌మంత క‌ష్టాలు మాములుగా లేవుగా..!

అంద‌రిలా కాకుండా చాలా దూకుడిగా స‌మంత వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని , ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆమె వర్కవుట్స్ చేస్తుంది. పుష్ప సినిమాలో ఊ అంటావా.. ఊహు అంటావా పాట కోసం ఆమె చాలా వర్కవుట్స్ చేసింది అంటూ చెప్పుకొచ్చాడు జునైద్. సమంత ఇప్పుడు యశోద సినిమాలో నటిస్తోంది. అలాగే సామ్ నటించిన శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే స‌మంత తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో వ‌ర్క‌వుట్ వీడియో ఒక‌టి షేర్ చేయ‌గా, ఇందులో ఆమె ప‌డుతున్న క‌ష్టాలు అంద‌రి మ‌తులు పోగొడుతున్నాయి. బాబోయ్ స‌మంత గ్లామ‌ర్ వెనుక ఇంత క‌ష్టం దాగుందా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి