samantha glamour treat
Samantha : విడాకుల తర్వాత సమంత ఏ రేంజ్‌లో రెచ్చిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఐటెం సాంగ్స్ ఇలా ఎందులోను తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్ ఇలా వరుసగా తెలుగు,తమిళ్, హిందీ సినిమాలతో సమంత ఫుల్ బిజీగా మారింది.ఇటీవలే విడుదలైన ప్యాన్ ఇండియా మూవీ పుష్పలో సమంత ఐటెం సాంగ్‌తో చేసిన అందాల ప్రదర్శన గురించి అందరికీ తెలిసిందే, అటు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో కూడా సమంత బోల్డ్ షో పై అందరూ చర్చించుకున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి షోనే ఇవ్వనుందనే ప్రచారం జరుగుతుంది.ఊ అంటావా అంటూ పుష్పతో ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసిన సమంత పుష్ప 2లో కూడా మరో ఐటెం సాంగ్ చేస్తుందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
మరోవైపు తమిళ్ హీరో మూవీలో హాట్ హాట్ అందాలతో ఫ్యాన్స్‌కు పండగ చేసేందుకు రెడీ అవుతోంది. త్వరలో రాబోతున్న తమిళ మూవీ కాతువాకుల రెండు కాదల్ సినిమా లో కూడా సమంత అందాల ఆరబోత పీక్స్ లో ఉంటుందని సమాచారం. సామ్ లుక్ తో అభిమానులకు పండగ చేయబోతున్నట్లుగా తాజాగా విడుదల అయిన పోస్టర్ లు, పాటను చూస్తేంటే అందరికీ అర్థం అవుతుంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి హీరోగా నయనతార, సమంత లు హీరోయిన్లుగా నటిస్తోన్నారు.తాజాగా విడుదలైన పోస్టర్స్ లో నయనతార పద్ధతిగా కనిపిస్తే, సమంత మాత్రం మోడ్రన్ డ్రెస్సులలో నానా రచ్చ చేస్తుంది. విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ను ప్రేమిస్తాడు.
samantha glamour treat
అందులో చివరికి ఎవరితో ఆయన సెటిల్ అవుతాడు అనేది సినిమా కథ అయ్యి ఉంటుంది. నయనతార ప్రియుడు అయిన విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈనెల 28న ఈ సినిమాను తమిళంలో రిలీజ్ కానుంది. అనిరుథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత తాజాగా తన పాన్ ఇండియా మూవీ యశోద సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ చిత్రాన్ని హరి-హరీశ్ దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
This website uses cookies.