Home » Entertainment » Samantha Health News Viral
Entertainment

Samantha : ఆందోళ‌న‌క‌రంగా స‌మంత ఆరోగ్యం.. మెరుగైన వైద్యం కోసం ద‌క్షిణ కొరియాకి..!

Authored By
Sam C
The Telugu News | Published on: November 29, 2022, 2:00 pm
Advertisement

Samantha: కొద్ది రోజుల క్రితం స‌మంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధ‌ప‌డుతున్నట్టు ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాధి కోసం సమంత అమెరికాలో చికిత్స తీసుకోగా, ఇంకా ఈ వ్యాధి నయం కాకపోవడంతో ఇప్పుడు మ‌రో కీలక నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఇటీవల సమంత ఆరోగ్యం క్షీణించిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అయితే అదంతా ఏమీ లేదని, సమంత బాగానే ఉన్నారని.. స్పష్టం చేశారు ఆమె మేనేజర్. దీంతో ఆమె ఆరోగ్యం వచ్చిన వార్తలు కేవలం రూమర్స్ అని భావించారు ఫ్యాన్స్.

Advertisement

అయితే స‌మంత ఆరోగ్యం విష‌యానికి సంబంధించి రూమర్స్ అస్స‌లు ఆగ‌డం లేదు. స‌మంత .. ఇంగ్లీష్ మెడిసన్‌ తో వ్యాధి నయం కాకపోవడంతో… మంచి వైద్యం కోసం కేరళకు వెళ్లిందని కూడా సమాచారం వచ్చింది. అక్కడ ఆమె ఆయుర్వేద చికత్స తీసుకుంటుందని ప్ర‌చారం చేశారు.. ఇక సమంత ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్టు మీడియా, సోషల్ మీడియాలో వార్తలు మరోసారి స్ప్రెడ్ అవుతున్నాయి. ఆమె పరిస్థితి దిగజారడంతో మెరుగైన చికిత్స కోసం దక్షిణా కొరియా దేశానికి తరలించినట్టుగా కొంద‌రు చెబుతున్నారు. సమంత ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని.. అందుకే మెరుగైన చికిత్స అందుబాటులో ఉన్న సౌత్ కొరియాకు తరలించార‌ని టాక్.

samantha Health news viral

Advertisement

Samantha : స‌మంత స్పందించు..!

ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ టెన్ష‌న్ ప‌డుతున్నారు. స‌మంత నీ ఆరోగ్యం గురించి స్పందించు. చాలా టెన్ష‌న్ గా ఉంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సమంత అనారోగానికి డిప్రెషన్ కారణమని తెలుస్తోది. నాగచైతన్యతో విడిపోయాక సమంత బాగానే కృంగిపోవ‌డం వ‌ల‌న‌ భారీగా ఎక్సర్ సైజులు చేసి కండరాలపై బాగా ఒత్తిడి పెంచింది. మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురి కావ‌డంతో సమంతకు ఈ ‘మయోసైటిస్’ అనే అరుదైన ప్రాణాంతక చికిత్స అందుబాటులో లేని ‘కండరాల క్షీణత’ వ్యాధి సోకినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఏదేమైన స‌మంత త్వ‌ర‌గా కోలుకొని తిరిగి సినిమాలు చేయాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి