Home » Entertainment » Samantha In Workout Session
Entertainment

Samantha : నా తప్పుల్ని సరిదిద్దుతున్నాడు : సమంత.. వీడియో..!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: January 8, 2022, 11:30 am
Advertisement

Samantha : సమంత ప్రస్తుతం మంచి ఫాంలోకి వచ్చింది. మళ్లీ నిన్నటి నుంచి సమంత ట్రెండ్ అవుతూనే ఉంది. ఊ అంటావా అనే పాట వీడియో విడుదలైంది. అలానే పుష్ప సినిమా ఓటీటీలోకి వచ్చింది. దీంతో సమంత మరోసారి వార్తల్లోకి ఎక్కేసింది. గంట గంటకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. దీంతో సమంత పేరు నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే వస్తోంది.

Advertisement

సమంత కూడా తన క్రేజ్, పాపులారిటీ బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. ఊ అంటావా పాట సక్సెస్‌తో సమంత మరింత స్పీడుగా దూసుకెళ్తోంది. ఇక ఆ పాటకు సంబంధించిన రిహార్సల్స్ వీడియోను కూడా వదిలారు. అది కూడా నెట్టింట్లో దుమ్ములేపేస్తోంది. అయితే తాజాగా సమంత మళ్లీ తన రొటీన్ లైఫ్‌లోకి అడుగుపెట్టేసినట్టు కనిపిస్తోంది.

samantha in workout session

Advertisement

Samantha : వర్కవుట్లతో సమంత బిజీ

సమంత నిత్యం వర్కవుట్లు చేస్తుందన్న సంగతి తెలిసిందే. మొత్తానికి సమంత ఇప్పుడు తన ట్రైనర్ జునైద్ సమక్షంలో వర్కవుట్లు చేస్తోంది. ఇక సమంత భారీ బరువులను ఎత్తుతూ వ్యాయామం చేస్తోంది. సమంత తప్పుగా వర్కవుట్లు చేస్తూ ఉంటే.. జునైద్ సరి చేస్తున్నాడట. ఈ విషయాన్ని చెబుతూ సమంత జిమ్‌లో కష్టపడుతున్న వీడియోను షేర్ చేసింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి