samantha intresting tweet viral
Samantha : టాలీవుడ్ ముద్దుగుమ్మ అందాల సమంత ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతున్న విషయం తెలిసిందే. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత ఈ అమ్మడు చేసే పోస్ట్‌లు నిత్యం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా, క్యూట్ హీరోయిన్‌గా పేరున్న సమంత అలియాస్ సామ్ ఏం చేసినా హల్‌చలే. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. అందం..అభినయం సొంతం చేసుకున్న సమంతా రూత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన ఫిట్నెస్ వీడియోలు, కొటేషన్స్, ప్రమోషనల్ బ్రాండ్స్ తదితర పోస్ట్‌లు షేర్ చేస్తూ ఉంటుంది.
అయితే తాజాగా సామ్ పెట్టిన పోస్ట్ చూసి తన అభిమానులు మురిసిపోతున్నారు.తాజాగా సమంత వైట్ ఫ్లవర్స్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో షేర్ చేసింది. వయసు పెరిగే కొద్దీ ఆలోచన స్థాయి కూడా పెరుగుతోంది అని అర్థం వచ్చేలా సామ్ ఈ పిక్ కి కామెంట్ పెట్టింది. ఈ ఫొటోకి సామ్ ఫ్యాన్స్ కామెంట్స్ మోత మోగిస్తున్నారు. 24 గంటలు గడవక ముందే ఈ పోస్ట్ కి మిలియన్ కి పైగా లైక్స్ వచ్చాయి. ఇటీవల సమంత తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంది. తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కి సంబంధించిన పిక్ అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ ఫోటోకి హీరోయిన్ కావ్య థాపర్, స్టైలిస్ట్ ప్రీతం లాంటి సెలెబ్రిటీలు రియాక్ట్ అయ్యారు.
samantha latest pic viral in social media
ఇటీవల సమంత 35వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే అదే రోజు ఏప్రిల్ 28న సామ్ నటించిన ‘కణ్మనీ రాంబో ఖతీజా’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి సరైన స్పందన రాలేదు. ఇక సమంత నటించిన అసలైన చిత్రాలు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. పాన్ ఇండియా మూవీ ‘యశోద’ ఆగస్టులో రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే పౌరాణిక చిత్రం శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ మూవీ కూడా రిలీజ్‌కి సిద్దంగా ఉంది. ఈ రెండు సినిమాలతో సమంత క్రేజ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.