Home » Entertainment » Samantha Looks Behind The Lot Of Reasons
Entertainment

Samantha : గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిన స‌మంత‌.. ఆప‌రేష‌న్ వ‌ల్ల‌నే ఇలా అయిందా?

Authored By
Sam C
The Telugu News | Published on: September 9, 2022, 7:00 pm
Advertisement

Samantha : అక్కినేని నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత పేరు తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. ఆమె ఏం చేసిన‌, ఏం చేయ‌క‌పోయిన కూడా ఏవేవో వార్త‌లు క్రియేట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. తెలుగు, త‌మిళ చిత్రాల్లో అగ్ర హీరోల స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించిన స‌మంత ఆ త‌ర్వాత యూ ట‌ర్న్ , ఓ బేబీ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ న‌టించి సూప‌ర్ హిట్స్‌ను సాధించింది. ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాల‌పై దృష్టి పెట్టింది. త్వ‌ర‌లో బ‌డా సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నుంద‌ని స‌మాచారం. అయితే స‌మంత ఆరోగ్యంపై ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. స‌మంత కొన్నాళ్లుగా చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతుంద‌ని, అందుక‌నే ఆమె బ‌య‌ట‌కు రావ‌టం లేద‌ని న్యూస్ వైర‌ల్ అయ్యింది.

Advertisement

Samantha : స‌మంత ఏంది ఇలా..

అయితే దీనిపై స‌మంత ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్ రియాక్ట్ అయ్యారు. ‘కొంద‌రు కావాల‌నే స‌మంత‌పై త‌ప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. ఆమెకు ఎలాంటి స‌మ‌స్యా లేదు. ఆరోగ్యంగా ఉన్నారు. ఈ నెల‌లోనే షూటింగ్స్‌లోనూ పాల్గొన‌బోతున్నారు. స‌మంత‌పై త‌ప్పుడు వార్త‌ల‌ను క్రియేట్ చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని సమంత ఆలోచిస్తుంది’ అని ఆయ‌న తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా సికింద్రాబాద్ లోని వేద పాఠశాలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రత్యేక పూజలు చేయించారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

samantha looks behind the lot of reasons

Advertisement

ఇందులో స‌మంత చాలా డ‌ల్‌గా క‌నిపిస్తుంది. క‌ళ్ల‌ద్దాలు పెట్టుకొని మొఖం లాగేసి డల్ గా మారిపోయి ..ఓ పేషెంట్ల తయారైంది అంటున్నారు జనాలు.ఏదేమైన స‌మంత కొద్ది రోజుల నుండి సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా లేక‌పోవ‌డంతో అనేక రూమ‌ర్స్ పుట్టుకొస్తున్నాయి. తాజాగా వచ్చిన వార్త‌ల‌పై స‌మంత ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి. ఇక సమంత నటించిన మరో చిత్రం “శాకుంతలం” కూడా షూటింగ్ పూర్తీ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని చాల ప్రతిష్ఠాతంకంగా చిత్రీకరిస్తూ నిర్మిస్తున్నాడు. అల్లు ప్రిన్సెస్ “అల్లు అర్హ” ఈ చిత్రంతో వెండితెరకి పరిచయం అవుతుంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి