samantha marries to be soon
Samantha: అక్కినేని నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారిన సమంత కొన్నాళ్లకు అతనికి బ్రేకప్ చెప్పి ఆ ఫ్యామిలీకి దూరంగా ఉంటుంది. విడాకులు తీసుకున్న దగ్గర నుండి సమంత తెగ వార్తలలో నిలుస్తూ వస్తుంది. అయితే ఇటీవల ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందని తెగ ప్రచారం జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయిన సద్గురు ని సమంత ఎక్కువగా ఆరాధిస్తుంది.. గౌరవిస్తుంది. రెగ్యులర్ గా ఆయన కార్యక్రమాలకు హాజరవుతుంది. విడాకులు తీసుకున్న సమయంలో డిప్రెషన్ కి లోన్ కాకుండా సమంత ఆయన యొక్క బోధనలు విని డిప్రెషన్ నుండి బయటకు వచ్చినట్లుగా కొందరు అంటూ ఉంటారు.
సమంతని రెండో పెళ్లి చేసుకోమని సద్గురు సూచించారట.సమంత రెండవ పెళ్లి విషయంలో ఆసక్తిగా లేదని.. కానీ తాను ఎంతగానో ఆరాధించే, గౌరవించే వ్యక్తి రెండో పెళ్లి గురించి సలహా ఇవ్వడంతో సమంత ఆలోచనలో పడ్డట్లుగా పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఈ క్రమంలో సమంత ధరించిన టీ షర్ట్ ఇప్పుడు అందరిలో అనేక అనుమానాలు కలిగిస్తుంది. నువ్వు ఎప్పుడు ఒంటరిగా నడవవు అని సమంత టీషర్ట్‌పై రాసి ఉంది. దీంతో సమంత ప్రేమలో పడిందని, ఆమె పెళ్లి త్వరలోనే జరగనుందని అంటున్నారు. గతంలో సమంత ప్రేమ, పెళ్లిపై ఆసక్తి లేదని చెప్పగా, ఇప్పుడు ఇలాంటి టీషర్ట్ ధరించడంతో అందరిలో అనేక ఆలోచనలు మొదలుతున్నాయి.
samantha marries to be soon
ఇక సమంతకి రెండో పెళ్లి ఆలోచనలోనే లేదని.. ప్రస్తుతం అనారోగ్య కారణాలు ఉండటంతో.. వాటి నుంచి కోలుకున్న తరువాత ఫుల్ ఫోకస్ సినిమాలపై పెడుతుందట. టాలీవుడ్.. బాలీవుడ్.. ఆ తరువాత హాలీవుడ్ రేంజ్‌లో ఎదగాలని సమంత ప్లానింగ్‌లో ఉన్నట్టు ఆమెకు టచ్‌లో ఉన్న మీడియా మిత్రులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ రెండో పెళ్లి వార్త గాసిప్ మాత్రమే అంటున్నారు. ఇక సమంత నటించిన శాకుంతలం చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, కబీర్ దుహాన్ సింగ్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.