Home » Entertainment » Samantha Naga Chaitasamantha Naga Chaitanya Gave Surprise Is That Truenya Gave Surprise To Samantha Is That True
Entertainment

Samantha : సర్‌ప్రైజ్.. సమంత ఇంటికెళ్లిన నాగాచైతన్య.. ఎందుకోసమో తెలుసా?

Authored By
mallesh
The Telugu News | Published on: December 21, 2021, 5:00 pm
Advertisement

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ..ఇటీవల ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సంగతి అందరికీ విదితమే. పాన్ ఇండియా మూవీలో ‘ఊ..అంటావా మావా’ సాంగ్‌కు బన్నీతో సమంత వేసిన స్టెప్పులు చూసి ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం సూపర్ హిట్ అవడంలో సమంత స్పెషల్ సాంగ్‌ చేసిన సమంతకు కూడా క్రెడిట్ ఉంటుందని ఈ సందర్భంగా మెగా అభిమానులు అంటున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే తాజాగా సమంతకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.‘పుష్ప’ పిక్చర్‌లో సమంత చేసిన స్పెషల్ సాంగ్..

Advertisement

పురుషులను కించ పరిచేలా ఉందని పలువురు హైకోర్టుకు వెళ్లారు. ‘ఊ అంటావా సాంగ్’ నిషేధించాలని కోరారు. అయితే, ఆ సంగతులు అలా ఉంచితే.. పుష్ప..సినిమా మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని సూపర్ సక్సెస్ అందుకుంటోంది. సక్సెస్ ఫుల్‌గా థియేటర్స్‌లో రన్ అవుతోంది.ఇకపోతే సమంత కూడా ఈ పాటలో సెక్సీగా కనిపించేందుకుగాను చాలా కష్టపడింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా తెలిపింది.ఇన్ స్టా పోస్టులో తాను ఈ పాట కోసం చాలా కష్టపడ్డానని, అన్నిటి కంటే సెక్సీగా కనబడటానికి చాలా అంటే చాలా కష్టపడ్డానని సమంత వివరించింది. ఈ సందర్భంగా తనను సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ చెప్పింది.

samantha naga chaitanya gave surprise is that true

Advertisement

Samantha : ఇంతకీ ఆ వార్త నిజమేనా..?

మొత్తంగా అలా సమంత సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న క్రమంలో నాగచైతన్య ఆమె ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చినట్లు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. అయితే, నాగచైతన్య సమంత ఇంటికి వెళ్లింది నిజమేనంటూ కొందరు అయితే సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరి సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్య ప్రస్తుతం ‘బంగార్రాజు’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ షూట్ అయిన తర్వాత ‘థాంక్యూ’ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. సమంత.. త్వరలో ‘యశోద’ మూవీ‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి