Home » Entertainment » Samantha Participated In Nayantara Birthday Celebrations
Entertainment

Samantha : ఒకరినొకరు కౌగిలించుకున్న నయనతార, సమంత.. బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్ వైరల్..!

Authored By
mallesh
The Telugu News | Published on: November 18, 2021, 10:10 pm
Advertisement

Samantha : లేడీ సూపర్ స్టార్ నయనతార బర్డ్ డే సందర్భంగా ఆమె అశేష అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నయన్ వారందరికీ థాంక్స్ చెప్పింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో బర్త్ డే జరుపుకుంటుండగా, బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. సమంతనే స్వయంగా వెళ్లి నయన్‌కు బర్త్ డే విషెస్ చెప్పింది.నయనతార బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి ఆమెకు కేకు తినిపించిన సమంత.. నయన్ గురించి ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది.

Advertisement

Samantha : నయన్ గురించి సమంత ఇంట్రెస్టింగ్ ఇన్ స్టా పోస్టు..

samantha participated in nayantara birthday celebrations

సదరు పోస్టులో నయనతార గురించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాసింది. ‘ఆమె చూసింది, ఆమె ధైర్యం చేసింది, ఆమె కల కన్నది, ఆమె ప్రదర్శించింది, ఆమె విజయం సాధించింది’ అని చెప్తూనే హ్యాపీ బర్త్ డే నయన్ అని సమంత రాసుకొచ్చింది. సదరు ఫొటోలో సమంత, నయనతార ఒకరిని మరొకరు కౌగలించుకున్నారు. ఈ ఫొటో బ్యాక్ సైడ్‌లో విఘ్నేశ్ శివన్ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

వీరిరువురు విఘ్నేశ్ శివన్ డైరెక్షన్‌లో వస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్ ’ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా తమిళ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రం ట్రయాంగిల్ లవ్ స్టోరిగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తి కాగా, త్వరలో విడుదల తేదీ గురించి మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే చాన్సెస్ ఉన్నాయి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి