Samantha : సౌత్ ఇండియాలో ఎవ్వరికీ దక్కని ఆఫర్ దక్కించుకున్న సమంత.. ఊహకందని బిగ్ న్యూస్..!
Samantha : ఓవైపు అరుదైన వ్యాధి బాధిస్తున్నా ఏమాత్రం లెక్కచేయకుండా కెరీర్ లో దూసుకుపోతోంది సమంత. తనకు వచ్చిన వ్యాధి తనను ఎంతో ఇబ్బంది పెట్టినా.. దానికి ట్రీట్ మెంట్ తీసుకుంటూనే తన సినిమా కెరీర్ ను కంటిన్యూ చేస్తోంది సమంత. ఇటీవల పుష్ఫ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసి నేషనల్ అభిమానులను సంపాదించుకుంది ఈ చిన్నది. ఇప్పుడు తను కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. నిజానికి.. తను సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. కానీ.. పుష్ప సినిమాతో బాలీవుడ్ లోనూ తనకు అవకాశాలు వస్తున్నాయి.
samantha photoshoot with famous photographer daboo ratnani
బాలీవుడ్ లోనూ తన లక్ ప్రదర్శించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది సమంత. నాగ చైతన్యతో విడాకులు తర్వాత సమంత కెరీర్ మరింత స్పీడ్ అందుకుంది. వెబ్ సిరీస్ లలోనూ దూసుకుపోతోంది. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఆ మధ్య ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లోనూ కొంచెం హద్దు మీరి నటించింది. అప్పటి నుంచి హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా మంచిగానే తనకు రెస్పాన్స్ వస్తోంది. బాలీవుడ్ గురించి తెలిసిన వాళ్లకు.. డబూ రత్నానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన క్యాలెండర్ పై చోటు దక్కించుకోవాలంటే ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అయి ఉండాలి.
samantha photoshoot with famous photographer daboo ratnani
Samantha : బాలీవుడ్ లో పాపులర్ అవడంతో డబూ రత్నానీతో ఫోటోషూట్
అయినా కూడా కొందరికే ఆయన చాన్స్ ఇస్తారు. తాజాగా ఆ చాన్స్ ను సమంత దక్కించుకుంది. డబూ రత్నానీ క్యాలెండర్ పై కనిపించే చాన్స్ దక్కడంతో సమంత ఎగిరి గంతేస్తోంది. తనకు బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వస్తుండటం వల్ల.. బాలీవుడ్ లో తనకున్న క్రేజ్ చూసి డబూ రత్నానీ తన క్యాలెండర్ మీద కనిపించే అవకాశాన్ని సామ్ కు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా.. సామ్ ఫోటోషూట్ స్టార్ట్ కాలేదు. దాని కోసమే సమంత ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సీటాడెల్ సిరీస్ లో నటిస్తోంది. అది హిందీ మూవీ. తెలుగులో శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
