samantha open on her divorce in Naga Chaitanya
Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య- సమంత గత ఏడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే మారింది. సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై గత కొంతకాలంగా అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియాలో ఎడ తెగని చర్చ జరుగుతోంది. సమంత, చై ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా గడుపుతుంటే… ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ ఈ జంట విడాకులపై రంధ్రాన్వేషణ చేస్తూనే ఉన్నారు. ఇకపోతే విడాకుల తర్వాత చైతూ గురించి ఎప్పుడు మాట్లాడని సామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాజీ భర్త క్యారెక్టర్ ని బయటపెట్టింది.
ఒకానొక సమయంలో నేను చైతన్యతో కలిసి షూటింగ్ చేసేటప్పుడు నా దగ్గర కనీసం అమ్మకు కాల్ చేసి మాట్లాడడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అప్పుడు నా పరిస్థితిని అర్ధం చేసుకున్న చైతన్య.. వెంటనే నా దగ్గరకు వచ్చి తన ఫోన్ ఇచ్చి ఎంతసేపైనా మాట్లాడమని చెప్పాడు. చైతన్య పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్.. ఫైన్షియల్ గా చైతూ తనను ఆదుకున్నాడని చెప్పుకొచ్చింది.ఇద్దరి మధ్య ఎంతో అండర్‌స్టాండింగ్ ఉండేది. ఒకరికొకరు చూడముచ్చటగా ఉండేవారు. ఇలాంటి జంట విడిపోయారు అంటే నిజంగా ఆశ్చర్యమనే చెప్పాలి.ఇదిలా ఉంటే సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి విడాకుల ప్రకటనకు సంబంధించిన పోస్టును తొలగించడం పలు చర్చలకు, సందేహాలకు తావిచ్చింది.
samantha positive comments on naga chaitanya
నాగచైతన్యతో విడిపోతున్నట్లు చేసిన ప్రకటనను సమంత తొలగించిందంటే… ఈ జంట మళ్లీ కలవబోతున్నారేమోనని ఫ్యాన్స్ సందేహాలు వెలిబుచ్చుతున్నారు. అయితే ఇన్‌స్టా నుంచి పోస్టును తొలగించినంత మాత్రాన సమంత-చైతన్య మళ్లీ కలవబోతున్నారనే నిర్దారణకు రావడమేంటని మరికొందరు ప్రశ్నించారు.నాగా చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికీ విడాకుల ప్రకటనకు సంబంధించిన పోస్టు అలాగే ఉంది. ఒకవేళ ఈ ఇద్దరూ మళ్లీ కలిసే ఛాన్స్ ఉంటే.. సమంత లాగే చైతన్య కూడా ఆ పోస్టును డిలీట్ చేసేవాడు కదా అనే సందేహం తలెత్తక మానదు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.