Home » Entertainment » Samantha Promotes Ekam Early Learning
Entertainment

Samantha : బాగానే ప్రమోట్ చేసుకుంటోంది.. ఇన్ని సమస్యల్లోనూ సమంత అలా

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 27, 2021, 9:50 pm
Advertisement

Samantha సమంత ఇప్పుడు కేవలం నటి మాత్రమే కాదు. వ్యాపారవేత్త కూడా. ఏకం స్కూల్, సాకీ డిజైనింగ్ దుస్తులు అంటూ సమంత వ్యాపార రంగంలోనూ దూసుకుపోతోంది. ఇక సాకీ దుస్తులను ప్రారంభించే సమయంలో అయితే తన చిన్న నాటి కష్టాలను, ఆశలను, కోరికలను కూడా చెప్పుకొచ్చింది. ఒకప్పుడు డిజైనర్ దుస్తులు వేసుకోవాలనే కోరిక ఉండేది. కానీ వాటిని కొనే శక్తి నా దగ్గర లేదు. కానీ ఇప్పుడు మాత్రం నేను సొంతంగా డిజైనింగ్ కంపెనీ పెట్టేంత స్థాయికి వచ్చాను అంటూ సాకీ ప్రారంభ సమయంలో చెప్పేసింది.

Advertisement

Samantha Promotes Ekam Early Learning

స్కూల్ గురించి చెప్పిన సమంత Samantha

అయితే ఇక ఏకం లర్నింగ్ స్కూల్‌లోనూ సమంత తన స్టైల్‌ను చూపిస్తోంది. విద్యను వ్యాపారంగా ఎంతో మంది చేసేశారు. ఇక సెలెబ్రిటీల పిల్లలు మాత్రమే ఏకం అనే తన స్కూల్‌లో జాయిన్ అయ్యేట్టు కనిపిస్తోంది. ఏకం స్కూల్ గురించి సమంత బాగానే ప్రమోట్ చేసుకుంటోంది. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఆన్ లైన్ క్లాసుల సమయంలోనూ సమంత వాటిని షేర్ చేస్తూ వచ్చింది. పిల్లలు ఆడే ఆటలు, చేసే అల్లరిని చూపించేది.

Advertisement

samantha akkineni with her team at tirumala

అయితే సమంత ప్రస్తుతం విడాకుల వ్యవహారం, రూమర్లతో కొట్టుమిట్టాడుతోంది. ఎన్ని రూమర్లు ఆమెను చుట్టిముట్టినా కూడా స్పందించడం లేదు. కానీ తన రొటీన్ పనులు చేసుకుంటోంది. ఏకం లెర్నింగ్ స్కూల్ గురించి ప్రమోట్ చేసుకుంది. ఎంతో సహజసిద్దమైన ప్రకృతి మద్యలో విద్యను నేర్పిస్తాం.. రండి.. మాతో వచ్చి చేరండి అని సమంత యాడ్ ఇచ్చేసుకుంది. సమంత మొత్తానికి వ్యాపార పనులతో ఫుల్ బిజీగా మారిపోయింది.

Advertisement

 

samantha akkineni latest look viral

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి