samantha purchase chaitu home
Samantha : సమంత- నాగ చైతన్య వ్యవహారం కొంత కాలంగా వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది. విడాకుల తర్వాత మొదట్లో బాధఫడ్డానని చెప్పిన సమంత .. ప్రస్తుతం దాని నుంచి పూర్తిగా బయటపడ్డానని తెలిపింది. అంతేకాదు మునపటి కంటే ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అయ్యానని పేర్కొంది. ఇటీవల ఓ షోలో నాగ చైతన్యకు మీకు మధ్య ఏవైన మనస్పర్థలు ఉన్నాయా అని అడగ్గా.. ‘మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే మీరు పదునైన వస్తువులు దాచాల్సి ఉంటుంది’ అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
ఏదేమైన సమంత కామెంట్స్‌తో వీరి విడాకుల వ్యవహారం ఇంకా హాట్ టాపిక్‌గానే ఉంది. తాజాగా సామ్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సమంత నాగ చైతన్య గురించి సీనియర్ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. నాగచైతన్య – సమంత కలిసి పెళ్లి తర్వాత మా ఇల్లు కొనుక్కున్నారు . పెళ్లి తర్వాత కొద్ది రోజులు అందులోనే ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపించేశారు. కొన్ని రోజుల తర్వాత మరో ఇల్లు కొనుక్కున్నారు. అయితే కొనుకున్న కొత్త ఇల్లు రీమోడలింగ్ చేస్తున్నారని అంతవరకు ఇక్కడే ఉంటామని చెప్పారని మురళీమోహన్ అన్నారు. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు.
samantha purchase chaitu home
సమంత బయట ఎక్కడో ప్రయత్నించింది. అయితే సామ్ కు ఎక్కడ ఇల్లు నచ్చక పోవడంతో మళ్లీ మా ఇల్లే కావాలని వచ్చి అడిగింది. అయితే అప్పటికే కొనుకున్న వారు ఇల్లు అమ్మడం కుదరదని చెప్పారు. అయినా వినకుండా సమంత ఎక్కువ డబ్బులిచ్చి ఆ ఇంటిని కొనుకుంది. ఇప్పుడు తన తల్లితో కలిసి ఆ ఇంట్లోనే ఉంటోంది అని మురళీమోహన్ చెప్పుకొచ్చారు. నాగ చైతన్య ఇంటిని సమంత ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం చర్చనీయాంశం అయింది. ఈ ఇల్లు మురళీ మోహన్ అమ్మను అని చెప్పిన నాగార్జునతో చెప్పించి మరి ఆ ఇల్లు కొన్నాడట చైతూ. విడిపోయాక ఎవరికి వారు ఇండివిడ్యువల్‌గా ఉంటున్నారు.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.