samantha r0mance with vijay devarakonda
Samantha : విజయ్ దేవరకొండ సమంత గతంలో మహానటి అనే సినిమాలో నటించారు. అయితే అది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే. కాని ఈ సారి ఇద్దరి మధ్య రొమాన్స్ బాగానే ఉండనుందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌లో ఆరంభం కానుందని, ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఇది కశ్మీర్ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీ అని, విజయ్ దేవరకొండ ఇందులో మిలటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారని భోగట్టా. తొలిసారి విజయ్ -సమంత కలిసి నటిస్తున్న నేపథ్యంలో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద చిత్రాలు చేస్తున్నారు. శాకుంతలం షూట్ పూర్తి అవ్వగా.. యశోద చిత్రీకరణ జరుపుకుంటుంది. అలాగే సమంత కొన్ని వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ లైగర్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 65 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్ తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు.లైగర్ నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో మంచి ఆదరణ పొందింది. అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టించింది.
samantha r0mance with vijay devarakonda
లైగర్ ఆగస్టు 25, 2022లో విడుదల కానుంది. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథలా కనిపిస్తోంది. ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారట పూరీ. లైగర్‌ను ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని అన్ని ప్రధాన భాషాల్లో విడుదలకానుంది లైగర్. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్డమ్' kingdom movie . గౌతమ్…
This website uses cookies.