Home » Entertainment » Samantha Reject Mahesh Babu And Pawan Kalyan Movies
Entertainment

Samantha : పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు ఇద్దరికీ కలిపి ఛీ కొట్టిన సమంతా ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 3, 2023 12:42 pm
Advertisement

Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా హీరోల పక్కన ఐటమ్ సాంగ్స్ కి ఆడిపాడుతూ మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ ను అందుకుంటుంది. ప్రస్తుతం సమంత నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తూ దూసుకెళుతోంది. ఈ మధ్యనే బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. అక్కడ ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నెగటివ్ పాత్రలో చేసి మెప్పించింది. దీంతో ఆమెకి హిందీలో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

Advertisement

Samantha reject Mahesh Babu and Pawan kalyan movies

ప్రస్తుతం హిందీలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇటు తెలుగులో విజయ్ దేవరకొండ తో ‘ ఖుషి ‘ సినిమాలో నటిస్తోంది. అయితే సమంత లేటెస్ట్ గా రెండు పెద్ద సినిమాలలో ఛాన్స్ వదులుకుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ సినిమాలో ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అయితే తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోయేసరికి ఆ సినిమాకు నో చెప్పేసిందట. పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ‘ సినిమాలో హీరోయిన్గా సమంతకు ఛాన్స్ వచ్చింది కానీ ఆమె రిజెక్ట్ చేసిందట.

Advertisement

అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో మొదటగా హీరోయిన్గా సమంతను అడిగారట. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో హీరోయిన్గా పూజ హెగ్డే తీసుకున్నారు. అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా శ్రీ లీల ను తీసుకున్నారు. అలా సమంత టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలను మిస్ చేసుకుని తప్పుచేసిందని అభిమానులు అంటున్నారు. ఇక సమంత గుణశేఖర్ దర్శకత్వంలో ‘ శాకుంతలం ‘ సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. భారత ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి