Home » Entertainment » Samantha Rejects Crazy Offers
Entertainment

Samantha : స‌మంత గ‌ట్స్.. ఇది వింటే హ్యాట్సాఫ్ చెప్ప‌కుండా ఉండలేరు..!

Authored By
Sam C
The Telugu News | Published on: November 17, 2022, 10:20 am
Advertisement

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా స‌మంత ఓ వెలుగు వెలుగుతుంది. ప‌ర్స‌న‌ల్ గా స‌మంత‌కి ఎన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చిన కూడా కెరీర్ ప‌రంగా దూసుకుపోతుంది. ఆచితూచి ప్రాజెక్టులు చేస్తూ అభిమానుల‌ని అల‌రిస్తుంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత కొంత మస్తాపానికి గురైనా ఆ తరువాత తేరుకుని మళ్లీ సినిమాలు చేస్తూ అల‌రిస్తుంది. రీసెంట్ గా `యశోద`తో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఓ బేబి త‌ర్వాత స‌మంత మ‌రో లేడి ఓరియెంటెడ్ చిత్రంతో మంచి హిట్ కొట్టింద‌నే చెప్పాలి. ఇందులో ఆమె న‌ట‌న కూడా అద్భుతం అని చెప్పాలి.

Advertisement

ఇక స‌మంత న‌టించిన శాకుంతలం చిత్రం విడుద‌ల కావ‌ల‌సి ఉంది. ప్ర‌స్తుతం స‌మంత విజ‌య్ దేవరకొండ తో `ఖుషీ` మూవీలో నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ లో వరుణ్ థావన్ తో ఓ సిరీస్ తో పాటు ప‌లు ప్రాజెక్ట్‌లు చేస్తుంది. అయితే ఈ అమ్మ‌డు క్రేజీ ప్రాజెక్ట్ లని సున్నితంగా రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుండ‌గా, ఇది విని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.. చియాన్ విక్రమ్ తో శంకర్ తెరకెక్కించిన `ఐ` మూవీ కోసం ముందు స‌మంత‌నే అడిగారట. కాని ఏవో కార‌ణ‌ల వ‌ల‌న సున్నితంగా నో చెప్పింద‌త‌ట‌. ఇక `పుష్ప`లో శ్రీవల్లిగా ముందు సుకుమార్..స‌మంత‌నే అడిగాడట. అయితే అనివార్య కారణాల వల్ల సమంత ఆ ఆఫ‌ర్ కూడా వ‌ద‌లుకుంది.

samantha rejects crazy offers

Advertisement

Samantha : డేరింగ్ అండ్ డాషింగ్..!

పాన్ ఇండియా మూవీని తిరస్కరించిన రిగ్రెట్ స‌మంత‌లో ఏ మాత్రం కనిపించలేదని అంటున్నారు. రీసెంట్ గా మరో పాన్ ఇండియా మూవీలో నటించే అవకాశం స‌మంత‌కు వచ్చిందట. షారుఖ్ ఖాన్ తో అట్లీ కుమార్ `జవాన్` మూవీని తెరకెక్కిస్తుండ‌గా, ఇందులో షారుఖ్ కు జోడీగా సామ్ ని సంప్రదించారట. అయితే ఆ ఆఫర్ ని కూడా వ్యక్తిగ‌త కారణాల వల్ల వ‌దులుకుంద‌ని తెలుస్తుంది. మరో హీరోయిన్ అయితే ఇలాంటి మంచి ఆఫర్లని తిరస్కరించే వారు కాదు. కానీ సామ్ అలా కాదు తను ఏ సినిమా చేయగలతో ఆ సినిమాలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఏదేమైన క్రేజీ ఆఫ‌ర్స్ వ‌దుల‌కోవ‌డం చూసి సామ్ గట్స్ కి హ్యాట్సాఫ్ అనాల్సిందే అంటున్నారు కొంద‌రు అభిమానులు

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి