Home » Entertainment » Samantha Responded On The Matter
Entertainment

Samantha : ఎట్ట‌కేల‌కు ఆ విషయంపై స్పందించిన సమంత.. నన్ను నేను ప్రశ్నించుకుంటానని..!

Authored By
mallesh
The Telugu News | Published on: November 22, 2021, 6:00 pm
Advertisement

Samantha : చైతూతో విడాకుల అనంతరం సామ్ చాలా బాధపడిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా కొందరు ఆమెను టార్గెట్ చేసి విమర్శించినా పెద్దగా పట్టించుకోలేదు. ఎంతో ఓపికగా ఉన్న సమంత చివరగా ఓ రోజు విమర్శలకు తనదైన శైలిలో గట్టి సమాధానం చెప్పింది. ఆ తర్వాత సామ్ సన్నిహితులు కూడా ఆమెకు సపోర్టుగా పోస్టులు పెట్టడంతో తప్పు ఎవరిదీ? అని నెటిజన్లు ఆలోచించడం ప్రారంభించారు. అప్పటివరకు సమంతదే తప్పని అందరూ భావించినట్టు తెలిసింది. ఇకపోతే సామ్ తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని అనకుంటున్నదట.. ఇన్ని రోజులు జరిగిన విషయాలను, బాధలను మర్చిపోయేందుకు మొన్నటివరకు తీర్థయాత్రలకు వెళ్లిన సామ్.. ప్రస్తుతం సినిమాలపై పూర్తిగా దృష్టి సారించినట్టు తెలిసింది.

Advertisement

Samantha : బాలీవుడ్‌లోకి ఎంట్రీ..

samantha responded on the matter

సామ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా స్పెషల్ సాంగ్స్‏లో కూడా కనిపించడానికి ఓకే చెప్పిందట ఈ చైన్నె ముద్దుగుమ్మ.. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పిందట.. అంతేకాకుండా మరికొద్ది రోజుల్లోనే సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. హీరోయిన్ తాప్సీ తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై సమంతతో బాలీవుడ్‌లో ఓ మూవీ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యన తాప్సీతో కలిసిన సామ్ షేర్ చేసిన ఫోటో అందుకు బలం చేకూర్చింది. సమంత నిజాంగానే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుందని గుసగుసలు కూడా వినిపించాయి.

Advertisement

ఇదే విషయంపై సామ్ కూడా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. మంచి స్టోరీ వస్తే తప్పకుండా బాలీవుడ్‌లో అడుగుపెడతానని ప్రకటించింది.హిందీలో సినిమాలు చేయాలని తనకు ఆసక్తిగా ఉందంటూ కామెంట్స్ చేసింది.సినిమా చేయాలంటే భాష పెద్ద సమస్య కాదని, కథలో మ్యాటర్ ఉంటే తప్పకుండా చేస్తానని తెలిపింది. కాగా ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్- 2’ సిరీస్‏తో పాన్ ఇండియా లెవల్లో సమంత గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి