Home » Entertainment » Samantha Responds On Divorce Issue
Entertainment

Samantha : విడాకుల‌పై స్పందించిన స‌మంత‌.. ఆయ‌నే కార‌ణ‌మంటూ కామెంట్

Authored By
Sam C
The Telugu News | Published on: July 3, 2022, 6:00 pm
Advertisement

Samantha : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో స‌మంత ఒక‌రనే విష‌యం తెలిసిందే. చూడ‌చ‌క్క‌ని అందంతో పాటు ఆక‌ట్టుకునే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. స‌మంత ఇటీవ‌ల ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు కాఫీ విత్ కర‌ణ్ షోకి హాజ‌రైంది. తాజా సీజన్‌లో సమంత, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, అనిల్ కపూర్, సారా ఆలీ ఖాన్, జ్వానీ కపూర్, అనన్య పాండే, విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్, కియారా అద్వానీ, టైగర్ ష్రాఫ్, కీర్తీ సనన్, రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ తదితరులు పాల్గొన్నారు. వీరంద‌రు ప‌లు వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల‌లోకి ఎక్కారు. ముఖ్యంగా స‌మంత విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement

స‌మంత డివోర్స్ మ్యాటర్ ఎంతగా వైరల్ అయిందో మనందరికీ తెలుసు. అక్కినేని నాగ చైతన్యను పెళ్లాడిన సమంత నాలుగేళ్ల పాటు ఆయనతో కాపురం చేసి చివరకు అనూహ్యంగా తన వివాహ బంధానికి బ్రేక్ చెప్పింది. వీరిద్దరూ అధికారిక ప్రకటన ఇవ్వడంతో చైసామ్ విడాకులు కన్ఫర్మ్ అయ్యాయి. అయితే ఈ ఇష్యూపై ఎన్నో రకాల వార్తలు షికారు చేశాయి. సమంత డివోర్స్ తీసుకోవడానికి కారణాలివే అంటూ ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. తాజాగా ఫస్ట్ టైమ్ పెళ్లి బంధంపై ఓపెన్ అయింది సమంత. పెళ్లి తరువాత జీవితంపై ఉండే ఎక్స్‌పెక్టేషన్స్ గురించి కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ షోలో చెప్పేసింది. కరణ్ జోహర్‌ను మాటలతో కవ్విస్తూ.. పెళ్లిళ్లు పెటాకులు కావడానికి నీవే కారణం. మీరు సినిమాలో జీవితం అంతా కభీ ఖుషీ కభీ ఘమ్ మాదిరిగా ఉంటుందని చూపించారు.

samantha responds on divorce issue

Advertisement

Samantha : క్లారిటీ ఇచ్చిన‌ట్టేనా?

కానీ లైఫ్ మొత్తం కొట్లాటలతో కేజీఎఫ్ మాదిరిగా ఉంటుంది అని కామెంట్ చేశారు. దాంతో అవునా అన్నట్టు కరణ్ జోహర్ ముఖం పెట్టారు. ఇప్పుడు ఆమె కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఫుల్ ఎపిసోడ్‌లో అస‌లు విష‌యం తెలుస్తుంద‌ని అంద‌రు అనుకుంటున్నారు. సమంత కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కేఆర్కే మూవీలో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించింది. సినిమా ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఇక ఆమె నటించిన శాకుంతలం, యశోదా సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. త్వరలోనే యశోదా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇంకా బాలీవుడ్ సినిమాతోపాటు దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ప్రయత్నిస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి