Home » Entertainment » Samantha Responds To Money Taken From Naga Chaitanya After Divorce
Entertainment

Samantha : విడాకుల తరువాత స‌మంత‌కు ఎన్ని డ‌బ్బులు ఇచ్చాడో చెప్పిన‌ నాగ చైతన్య ..!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: December 24, 2021 9:59 am
Advertisement

Samantha : టాలీవుడ్ క్యూట్ పెయిర్ నాగ చైతన్య, సమంత విడాకుల వార్త నుంచి వారి అభిమానులు ఇంకా కోలుకోవడం లేదు. అక్కినేని ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన సమంత నాలుగేళ్లు తిరగకముందే ఊహించని విధంగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. విడాకుల అనంతరం… వీరిద్దరూ దీనిపై ఎక్కడా అఫిషియల్ గా మాట్లాడలేదు. అయితే వీరిద్దరికీ సంబంధించిన ప్రతీ అంశం వైరల్ అవుతూ వచ్చింది. అయితే ఇదిలా ఉండగా విడాకుల అనంతరం వీరిద్దరి అభిమానులు ఒకరిపై ఒకరు ట్రోల్స్ జరుపుకున్నారు. నాగ చైతన్య సమంతను మోసం చేశాడని ఓ వర్గం.. సమంతనే చైను వదిలేసి వెళ్లిందంటూ ఆ ఇద్దరిపై కూడా ఓ రేంజ్ లో విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా వీటిపై సమంత స్పందించారు.

Advertisement

సమంత, నాగ చైతన్య విడాకులపై అంశంపై స్పందిస్తూ ఓ అభిమాని సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సమంత తన మాజీ భర్త నుంచి విడాకుల భరణంగా రూ. 50 కోట్లను వసూలు చేసిందనే కామెంట్ పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఎంతో బాధలో ఉన్న తనపై మానసికంగా దాడి చేస్తూ ఇలాంటి ఆరోపణలతో మరింత వేదించవద్దని ఆమె చేతులు జోడించి వేడుకుంది. విడాకుల అంశంలో తనపై వస్తున్న ట్రోల్స్ ను ఆమె తీవ్రంగా ఖండించింది. సంపాదన విషయంలో అక్కినేని కుటుంబంతో వివాదాలు, అబార్షన్ల గురించి వస్తున్నవి కేవలం పుకార్లేనని సమంత కొట్టి పారేసింది. తనపై నెగిటివ్ కామెంట్ చేస్తున్న జనాలా ఆత్మలను ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాడనే అర్థంతో ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది.

samantha responds to money taken from Naga chaitanya after divorce

Advertisement

Samantha : అవన్నీ వట్టి పుకార్లేనంటూ కొట్టి పారేసిన సమంత..!

సమంత గతేడాది నటించిన ఫ్యామిలీ మెన్ సిరీస్ , సూపర్ డీలక్స్ చిత్రాలు సూపర్ హిట్ లుగా నిలిచి ఆమెకు పాన్ ఇండియా నటిగా గుర్తింపు తెచ్చాయి. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ ఆమె పోషించిన పాత్రలు వివాదాస్పదంగా ఉన్నాయి. అక్కినేని కుటుంబంలోని ఓ మహిళ అలాంటి పాత్రలు చేయకూడదని సమంతపై ఒత్తిడి పెంచారని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వివాదాల కారణంగానే ఆమె ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చేసిందని టాక్ వినిపించింది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి