Home » Entertainment » Samantha Ruth Prabhu Is Going To Get Marry Again
Entertainment

Samantha : మ‌ళ్లీ పెళ్లి పీట‌లెక్క‌బోతున్న స‌మంత.. వ‌రుడు ఎవ‌రో తెలుసా?

Authored By
Sam C
The Telugu News | Published on: September 7, 2022, 12:30 pm
Advertisement

Samantha : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న స‌మంత .. నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత నిత్యం ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తుంది. సినిమాలు, సోష‌ల్ మీడియా పోస్ట్‌లు ఇలా భిన్న‌మైన విష‌యాల‌తో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. చైతూ, సామ్ వీరిద్ద‌రూ క‌లిసి ఉన్న‌ప్ప‌టి రోజుల‌ను అభిమానులు మ‌ర‌చిపోలేక‌పోతున్నారు. ముఖ్యంగా స‌మంత కుటుంబ స‌భ్యులే మ‌ర‌చిపోలేక‌పోతున్నారు. ఎందుకంటే స‌మంత తండ్రి జోసెఫ్ ప్ర‌భు రీసెంట్‌గా నాగ చైత‌న్య‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘చాలా కాలం క్రితం ఒక క‌థ ఉండేది. ఆ క‌థ ఇక‌పై ఉండ‌క‌పోవ‌చ్చు. కొత్త క‌థ‌ను, కొత్త అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం’’ అని మెసేజ్‌తో పాటు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో రిసెప్ష‌న్‌, పెళ్లి స‌మ‌యాల్లో నాగ చైత‌న్య‌ తో ఉన్న‌ప్ప‌టి ఫొటోల‌ను ఆయ‌న షేర్ చేశారు.

Advertisement

Samantha : నిజ‌మెంత‌?

స‌మంత తండ్రి పోస్ట్ తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. ఈ పోస్ట్ త‌ర్వాత ఇద్ద‌రు మ‌ళ్లీ కలుస్తారా అనే విష‌యం కూడా హాట్ టాపిక్ అయింది. ఇలా దీని గురించి చ‌ర్చ న‌డుస్తున్న స‌మ‌యంలోనే స‌మంత రెండో పెళ్లి విష‌యం కూడా వైర‌ల్ అవుతుంది. సమంత త్వరలోనే మళ్లీ పెళ్లి చేసుకోబోతుంది. గత కొన్ని రోజులుగా ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తనకు కాబోయే కొత్త భర్త కోసమే సామ్ జూబ్లిహిల్స్ లో ఓ కొత్త విల్లా కూడా తీసుకుందని, ఆ ఇంటి పునరుద్దరణ పనులను జయభేరీ సంస్థ చూస్తోందని తెలుస్తోంది. ఇక సామ్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

Samantha Ruth Prabhu Is Going To Get Marry Again

Advertisement

కొద్ది రోజులుగా స‌మంత ముంబైలో ఉంటున్న‌ట్టు తెలుస్తుండగా,ఆమె చేసుకోబోయే వ్య‌క్తి కూడా బీటౌన్‌కి చెందిన వ్య‌క్తొ అని అంటున్నారు. అతగాడు గత కొన్ని నెలలుగా పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయిపోయ్యాడు. పైగా సమంత ప్లాట్ లోనే ఉంటున్నాడట‌. అత‌డిని అక్క‌డ‌ చూసిన ఓ యంగ్ డైరెక్టర్ ఈ వార్తను ఇండస్ట్రీలోని కొంద‌రికి చెప్ప‌డంతో ఈ వార్త వైర‌ల్‌గా మారింది. ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ లోనే అతనితో సామ్ కి చనువు ఏర్పడిందట. అసలు చైతుతో సమంత విడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అని టాక్ ఉంది. మరి ఇందులో ఎంత నిజముంద‌నేది తెలియాల్సి ఉంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి