Home » Entertainment » Samantha Samantha Instagram Post Viral In Social Media
Entertainment

Samantha : నాగచైతన్యతో గడిపిన ఇంట్లోనే సమంత.. ట్విస్ట్ ఏంటంటే?

Authored By
mallesh
The Telugu News | Published on: November 3, 2021, 12:20 pm
Advertisement

Samantha : అక్కినేని నాగచైతన్య నుంచి సమంత విడిపోయిన సంగతి అందరికీ విదితమే. అయితే, విడాకుల ప్రకటన వచ్చిన నాటి నుంచి సమంత ప్రతీ రోజు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంటుంది. ఎవరో ఒకరు సమంతను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతుండగా, ఆ విషయమై చర్చ జరుగుతూనే ఉంది. అయితే, తన వ్యక్తిగత విషయాలపై ఎవరు వార్తలు రాయొద్దంటూ సమంత కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంది. ఈ సంగతులు అలా ఉంచితే… సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన వార్త ఒకటి తెగ వైరలవుతోంది.నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియాలో ఇంతకు ముందులాగానే చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా డెయిలీ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంది.

Advertisement

samantha naga chaitanya

తాజాగా సమంత తన కుక్క పిల్లలకు సంబంధించి ‘మార్నింగ్‌ మ్యాడ్‌నెస్‌’ అంటూ ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టుతో పాటు ‘న్యూ బ్రింగింగ్ బ్యాక్’ అనే పోస్టును కూడా పెట్టింది సమంత. అలా తనకు సంబంధించిన బ్యూటిఫుల్ ఈవెంట్స్ పంచుకుంటున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఓ విషయం చర్చనీయాంశమవుతోంది. అదేంటంటే..ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోల్లో తన ఇల్లు గురించి చర్చ జరుగుతున్నది. సదరు ఫొటోలో సమంత, నాగచైతన్యతో కాపురం చేసిన ఇల్లు అదేనేమో అని కొందరు అంటున్నారు. దాంతో నాగచైతన్యతో డైవోర్స్ తీసుకున్నప్పటికీ నాగచైతన్య ఇంటిలోనే సమంత ఉంటుందని అనుకుంటున్నారు. ఈ విషయమై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సమంత జూబ్లీహిల్స్‌లో తన కోసం సెపరేట్‌గా ఓ హౌస్ కొనుక్కుందని, ఆ హౌస్ రినొవేషన్ వర్క్స్ జరుగుతున్నాయని, అవి పూర్తి కాగానే సమంత అక్కడకు షిఫ్ట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

Samantha : ‘న్యూ బ్రింగింగ్ బ్యాక్’ అంటూ ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్..

Samantha

ప్రజెంట్ సమంత గచ్చిబౌలిలోని ఓ అపార్టుమెంటులో ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా విడాకుల తర్వాత కూడా సమంత విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. సమంత సినిమాల విషయానికొస్తే.. ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘శాకుంతలం’, కోలీవుడ్ ఫిల్మ్ ‘కాతు వాకుల రెండు కాదల్’ పూర్తి చేసిన సమంత.. ప్రజెంట్ హిందీ ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి