Home » Entertainment » Samantha Saree Pics In Viral
Entertainment

Samantha : చీర‌క‌ట్టులోను చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తూ ర‌చ్చ చేస్తున్న స‌మంత‌

Authored By
Sam C
The Telugu News | Published on: February 26, 2022, 8:00 pm
Advertisement

Samantha: అందాల ముద్దుగుమ్మ స‌మంత ఇటీవ‌లి కాలంలో చేసే సంద‌డి మాములుగా లేదు. ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన స‌మంత ఫిల్మ్ ఇండస్ట్రీలో 12 ఏండ్లు పూర్తి చేస్తుకుంది. ఈ సందర్భంగా సమంత చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికన తన సినీ ప్రయాణ అనుభూతిని అభిమానులకు తెలియజేసింది. ఈ మేరకు హృదయపూర్వకంగా ఇన్ స్టా, ట్వీట్టర్ లో నవ్వుతూ ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ నోట్ రాసింది. సమంత 2010లో ‘ఏ మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ లో ఎంటీ ఇచ్చారు. ఈ మూవీతో తెరంగేట్రం చేసిన సమంత సినీ పరిశ్రమలో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది.

Advertisement

26 ఫిబ్రవరి 2010న, సమంతా తన మాజీ భర్త నాగ చైతన్య సరసన తొలిసారిగా నటించింది. ఈ ప్రత్యేక రోజును గుర్తు చేసుకుంది.అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం ఇంకా సోషల్ మీడియాలో నానుతూనే ఉంది. తమ మధ్య విభేదాలు రావడంతో తమ యొక్క భార్యాభర్తల బంధానికి ముగింపు పలుకుతున్నామని, కలిసి జీవించడం లేదని, మేము విడిపోతున్నాం అని ఇద్దరూ ప్రకటించి నెలలు కావస్తున్నా వారి గురించి రోజూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. స‌మంత సోష‌ళ్ మీడియాలో చేసే కొన్ని పోస్ట్‌లు కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి.తాజాగా స‌మంత త‌న సోష‌ల్ మీడియాలో చీర‌క‌ట్టుతో కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

samantha saree pics in viral

Advertisement

Samantha : స‌మంత అందాల ఆర‌బోత‌..

క్లీవేజ్ షోతో కేక పెట్టించే అందాలు ఆర‌బోస్తూ ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ‌కు కుర్ర‌కారు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. స‌మంత ఇప్ప‌టికీ కొన్ని లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మ‌రోవైపు క‌థానాయిక‌గా ప‌లు సినిమాలుచేస్తుంది. తెలుగులో శాకుంత‌లం షూటింగ్ పూర్తి చేసిన సామ్ త్వ‌ర‌లో య‌శోద అనే సినిమా చేయ‌నుంది. శాకుంతలం చిత్రంలో స‌మంత చూడ ముచ్చ‌ట‌గా కనిపిస్తుంది. పచ్చని వనంలో ఓ రాయిమీద కూర్చున్న సమంత.. తెల్లని దుస్తుల్లో పాలరాతి శిల్పంలా మెరుస్తోంది. ఎర్రని పూలనే ఆభరణాలుగా మార్చి చేసిన అలంకరణ ఆమెకి మరింత అందాన్ని తెచ్చింది. చుట్టూ జింకలు, నెమళ్లు, కుందేళ్లు, హంసలు, సీతాకోక చిలుకలు, రకరకాల పక్షులు ఉన్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి