Home » Entertainment » Samantha Satires On Alia Bhatt
Entertainment

Samantha : అలియాని వెన‌క్కి నెట్టేందుకు డ‌బ్బు ఇచ్చి మోసం చేసిన స‌మంత ..!

Authored By
Sam C
The Telugu News | Published on: July 24, 2022, 9:30 pm
Advertisement

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లి కాలంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. ఇన్నాళ్లు సౌత్‌కి ప‌రిమితం అయిన ఈ అమ్మ‌డు క్రేజ్ నార్త్‌కి కూడా పాకింది. ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2లో రాజీ పాత్రతో ఉత్తరాది వారికి కనెక్టయిన సామ్ ఆ తర్వాతా `ఊ అంటావా ఊఊ అంటావా!` (పుష్ప) పాటతో అక్కడ యూత్ ని గుండెల్లో గుడి కట్టుకుంది. ఇటీవల కరణ్ జోహార్ `కాఫీ విత్ కరణ్- సీజన్ 7` మూడవ ఎపిసోడ్ లో రెడ్ హాట్ లుక్ తో కట్టి పడేసింది. ఖిలాడీ అక్షయ్ కుమార్ తో కలిసి సామ్ కరణ్ షోలో పాల్గొంది. ఈ ఎపిసోడ్లో సమంత పలు విషయాలపై దాపరికం అన్నదే లేకుండా నిక్కచ్చిగా మాట్లాడింది. ముఖ్యంగా త‌న మాజీ భర్త నాగ చైత‌న్య‌కు సంబంధించి చాలా ఓపెన్‌గా మాట్లాడేసింది.

Advertisement

ఇక‌ ఇటీవలి ఓ సర్వే గురించి కరణ్ జోహార్ ఈ షోలో ప్రశ్నించారు. ప్రఖ్యాత ఓర్మాక్స్ జాబితాలో అత్యంత ప్రజాదరణ పొందిన కథానాయికగా సమంత పేరు టాప్ వన్ గా నిలిచిందని.. ఆలియా భట్- నయనతార – దీపికా పదుకొనే -కాజల్ అగర్వాల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారని కరణ్ వెల్లడించాడు. అయితే ఇది ఎలా సాధ్యమైంది? అన్నదానికి సామ్ ఎంతో ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. దీనిపై సమంత స్పందిస్తూ.. “నిజాయితీగా ఉండాలి.. ఓర్మాక్స్ వారికి డబ్బు చెల్లించాను“ అంటూ చమత్కరించింది. కరణ్ రెట్టిస్తూ మరోసారి ఇదే ప్రశ్నను అడిగాడు. “మీరు అలియా భట్ ని ఓడించారు. అది ఎలా అనిపిస్తుంది? అనగానే.. “క్షమించండి… అధిక ధర చెల్లిస్తేనే ఇది సాధ్యం“ అని ఫన్ ని కంటిన్యూ చేసింది.

samantha satires on alia bhatt

Advertisement

Samantha : సమంత సెటైర్స్..

డ‌బ్బు ఇచ్చి మోసం చేసినట్టు స‌మంత చేసిన ఈ ఫ‌న్నీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. సామ్ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి శాకుంతలం- యశోద విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఖుషి సినిమాలో నటిస్తోంది. సమంత బాలీవుడ్ అరంగేట్రం గురించి కథనాలొస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సమంత వరుసగా మూడు నాలుగు హిందీ చిత్రాలకు కమిటైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆయుష్మాన్ ఖురానాతో డెబ్యూ సినిమా ఉంటుందని అటుపై అక్షయ్ కుమార్ సరసన నటిస్తుందని కూడా టాక్ వినిపించింది. ఇంతలోనే యూరి ఫేం విక్కీ కౌశల్ సరసన ఇమ్మోర్టల్ అశ్వథామ చిత్రంలోనూ నాయికగా నటించనుందని టాక్ వినిపించింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి