Samantha fans fire on naga chaitanya
Samantha: ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత నిత్యం ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. గత రెండు మూడు రోజులుగా సమంత పెళ్లి చీర మ్యాటర్ వైరల్ అవుతోంది. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన సమంత రీసెంట్‌గా ఆయనతో విడాకులు తీసుకున్న సమంత ఆయన జ్ఞాపకాలను తిరిగి ఇచ్చేస్తుంది. ఆ చేదు జ్ఞాపకాలు మరిచేలా తన రెగ్యులర్ ఫొటోస్, పాజిటివ్ కొటేషన్స్ షేర్ చేస్తూ వచ్చింది. తాజాగా నాగ చైతన్యకు సంబంధించి తన వద్ద ఉన్న వస్తువులన్నీ తిరిగి ఇచ్చేయాలని ఫిక్స్ అయిన సామ్, తన పెళ్లి చీర సహా అన్నీ తిరిగి ఇచ్చేసిందనే సమాచారాలు తెగ షికారు చేస్తున్నాయి.
సమంత, చైతూ నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్.. ఇలా ప్రతి వేడుకలో వారు ధరించిన వస్త్రాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ముఖ్యంగా నిశ్చితార్థం, పెళ్లి వేడుకల్లో సమంత ధరించిన చీరల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. నిశ్చితార్థం రోజున సమంత కట్టుకున్న చీరను ప్రముఖ డిజైనర్ క్రేశా బజాజ్ రూపొందించారు. నాగచైతన్యతో పరిచయమైనప్పట్నుంచి, పెళ్లికి తొలి అడుగు నిశ్చితార్థం వరకూ వారి మధ్య జరిగిన అందమైన అనుభూతులను బొమ్మల రూపంలో చీరపై డిజైన్ చేశారు.పెళ్లి రోజు సమంత ధరించిన చీరకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ శారీ దగ్గుబాటి రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. అంటే నాగ చైతన్య అమ్మమ్మది. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలకు గౌరవ సూచకంగా ఈ చీరను చీరను సమంత పెళ్లి రోజు కట్టుకుంది.
Samantha sent her wedding saree back to Naga Chaitanya
అయితే విడాకుల అనంతరం చై, అక్కినేని కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాలను సామ్ వదిలించుకోవాలనుకుంటుందట. అందుకే ఈ పెళ్లి చీరను తిరిగి నాగ చైతన్యకు ఇచ్చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. సమంత, నాగచైతన్యలు గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో వీరి పెళ్లి ఎంతో అట్టహాసంగా జరిగింది. నాగ చైతన్య, సమంత తొలిసారిగా.. 2009లో ఏ మాయ చేసావే చిత్రం సెట్స్‌లో కలుసుకున్నారు. నటీనటులు వారి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అది కూడా మంచి లవ్‌స్టోరి చిత్రం కావడం.. తెరపై వారి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.