Home » Entertainment » Samantha Shared Her Latest Photos In Instagram
Entertainment

Samantha : గ్లామర్ డోస్ బాగా పెంచేసిన సమంత.. అలా కొంటె చూపులతోనే సైగలు..

Authored By
mallesh
The Telugu News | Published on: December 15, 2021, 9:40 am
Advertisement

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యకు డైవోర్స్ ఇచ్చిన తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తూనే పాన్ ఇండియా ఫిల్మ్స్‌కు ఓకే చెప్పిన సమంత.. ఇటీవల ఇంటర్నేషనల్ మూవీ చేసేందుకుగాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ‘ఆరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే అంతర్జాతీయ చిత్రం చేయబోతున్నట్లు సమంత అధికారికంగా ప్రకటించింది. ఈ సంగతులు అలా ఉంచితే సమంత ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరలవుతోంది.

Advertisement

Samantha : అలా కొంటె చూపులతో కుర్రకారు మతి పోగొడుతున్న సమంత..

‘ఇన్ సాక్షాకిని ’ అనే క్యాప్షన్‌తో సమంత ఇన్ స్టాలో ఫొటో షేర్ చేసింది. సదరు ఫొటోలో సమంత స్టన్నింగ్ లుక్స్ ఇచ్చింది. తన నడుముపై చేయి వేసుకుని అలా ఓ మాదిరిగా చూస్తూ సమంత చాలా అందంగా కనబడుతోంది. సమంత ధరించిన ఈ బ్లాక్ విత్ మిక్స్‌డ్ కలర్ డ్రెస్సును ప్రీతమ్ జుకల్కర్ స్టైలింగ్ చేసినట్లు సమంత పేర్కొంది. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు సమంత గ్లామర్ డోస్ బాగా పెంచేసిందని అంటున్నారు. ఈ ఫొటోకు కమెడియన్ సునీల్ లైక్ కొట్టగా, ‘సామ్ బ్యూటిఫుల్, వావ్, లవ్ యూ సామ్’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

samantha shared her latest Photos in instagram

Advertisement

ఇకపోతే సమంత సినిమా కెరీర్ ప్రజెంట్ పీక్స్‌లో ఉందని చెప్పొచ్చు. వరుస సినిమాలు చేస్తూనే తాజాగా స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా.. మావా’ అనే సాంగ్‌కు బన్నీతో కలిసి చిందేసింది సమంత. ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ ఈ నెల 17న విడుదల కానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ ఫిల్మ్ పైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. సమంత ఇటీవల ‘యశోద’ అనే ఉమన్ సెంట్రిక్ పాన్ ఇండియా ఫిల్మ్ చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి